Venkatesh- Balakrishna: బాలయ్యతో వెంకటేష్ కామెడీ.. ఫన్ లవర్స్ కి ఫుల్ కిక్కే

Venkatesh- Balakrishna: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కీలక పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. హీరో వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెంకటేష్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఇంటర్వెల్ కి ఫుల్ కామెడీగా సినిమా టర్న్ అయ్యేలా ఈ పాత్ర ఉంటుందట. దీనిపై త్వర‌లోనే అధికార‌కంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇక […]

Written By: Shiva, Updated On : June 26, 2022 6:17 pm
Follow us on

Venkatesh- Balakrishna: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కీలక పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. హీరో వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెంకటేష్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఇంటర్వెల్ కి ఫుల్ కామెడీగా సినిమా టర్న్ అయ్యేలా ఈ పాత్ర ఉంటుందట. దీనిపై త్వర‌లోనే అధికార‌కంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం కూడా ఉందని తెలుస్తోంది.

Venkatesh- Balakrishna

ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. పైగా బాలయ్యతో పాటు వెంకటేష్ కూడా సినిమాలో ఉంటాడు. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది.

Also Read: Sammathame 2nd Day Collections: ‘సమ్మతమే’ 2 డే కలెక్షన్స్.. రిజల్ట్ ఇదే !

ఇక ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి – బాలయ్య బాబు – వెంకటేష్ లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే… ఆ కిక్కే వేరు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.

Venkatesh- Balakrishna

మరోపక్క ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు. ప్రస్తుతం షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డేట్లు కేటాయించాడు. ఐతే, కరోనా రావడంతో బాలయ్య ఇంటికే పరిమితం అయ్యాడు.

నిజానికి బాక్సాఫీస్ వద్ద బాలయ్యకు అసలు రేంజ్ లేదు అని అఖండ ముందు వరకూ కొంతమంది కామెంట్స్ చేసేవారు. అయితే, ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. అదే పుష్పకి కలిసి వచ్చినట్లు.. టికెట్ రేట్లును రెండు వందలకు, ఐదు వందలకు అమ్ముకుని ఉండి ఉంటే.. బాలయ్య 200 కోట్ల మార్క్ ను కూడా దాటేవాడేమో.

Also Read:Srinidhi Shetty: పాన్ ఇండియా హిట్ కొట్టినా.. పాపం, పాపకు కలిసి రావడం లేదు

Tags