Kesari Kheda Crossing Bridge: ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. కాకపోతే ఆ వంతెనను సక్రమంగా నిర్మించాలని అనుకున్నారు. వంతెన నిర్మాణంలో సగం పనులు కూడా పూర్తయిపోయాయి. కానీ ఇంతలోనే ఒక తలనొప్పి ఎదురయింది. దీంతో నిర్మాణ పనులు చేపడుతున్న ఇంజనీర్ ఒక్కసారిగా తల పట్టుకున్నారు. దీంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి రావాల్సిన వంతెన.. ఇలా ఆగిపోవడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది.
Also Read: China: చైనా యొక్క ఇంజనీరింగ్ అద్భుతం.. ఆకాశమంత ఎత్తులో వంతెన
ఇంతకీ ఏం జరిగిందంటే..
బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో – కృష్ణ నగర్ – కేసరి ఖేడ క్రాసింగ్ ప్రాంతంలో 74 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించి కొంతకాలం క్రితమే పనులు మొదలయ్యాయి. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణానికి రెండు అంతస్తుల భవనం అడ్డం వచ్చింది. దీంతో మూడు నెలలుగా బ్రిడ్జి నిర్మాణం నిలిచిపోయింది. పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో పనుల్లో భాగస్వాములైన కార్మికులు ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు. పనులు అర్థాంతరంగా ఆగిపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Also Read: Krishna River- Cable Bridge: కృష్ణా నదిపై రెండంతస్థుల కేబుల్ బ్రిడ్జి… కేంద్రం గ్రీన్ సిగ్నల్
అప్పుడు తెలియదా
ఈ వంతెన నిర్మాణంలో ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించిన అధికారులకు ఆ భవనం కనిపించకపోవడం విశేషం. దీంతో వంతెన నిర్మాణం ఒక దశ పూర్తి చేసుకోగా.. మిగతా దశ నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తుండగా.. భవనం అడ్డు రావడంతో ఇంజనీర్ తలలు పట్టుకున్నాడు. దీంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వాస్తవానికి ఈ వాన కాలంలోపు ఆ వంతెన నిర్మాణం పూర్తి కావాలి. ప్రజలకు అందుబాటులోకి రావాలి. కానీ వంతెన నిర్మాణంలో భాగంగా ఆ భవనాన్ని పట్టించుకోలేదని.. అందువల్లే పనులు ఆగిపోయాయని స్థానికులు అంటున్నారు..” అధికారులకు ఈ విషయం ముందే తెలుసు. కానివారు దీనిని పట్టించుకోలేదు. బిల్డింగ్ మీదుగా వంతెన నిర్మించే అవకాశం లేదు. పైగా అది రెండంతస్తుల భవనం. ఆ భవనం కూడా అతిపెద్దగా ఉంది. దానిని పడగొట్టాలంటే సాధ్యం కాదు. ఆ భవన యజమాని ఏమంటాడో తెలియదు. అతడికి నోటీసులు కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు పడగొట్టడానికి అవకాశం లేదు. పైగా అతడికి పరిహారం ఇస్తేనే దానికి ఒప్పుకుంటాడు. మరి అధికారులకు ఈ విషయం తెలియదా? తెలిసి కూడా పట్టించుకోలేదా? అనేది అర్థం కావడం లేదని” స్థానికులు అంటున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించి త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. వంతెన నిర్మాణం పూర్తిగా కాకపోతే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
Bol Radha Bol Sangam hoga ke nahi… ?
Railway over bridge in Kesari Kheda to connect Para, #Lucknow.#UttarPradesh pic.twitter.com/3F6ieXV5ei
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 8, 2025