https://oktelugu.com/

పెన్షన్ తీసుకునే వాళ్లకు మోదీ సర్కార్ శుభవార్త..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షన్ తీసుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెన్షన్ తీసుకునే వారికి ఊరట కలిగే విధంగా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు పెన్షన్ స్లిప్ తీసుకోవడానికి బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పెన్షనర్ల కొరకు కొత్త సర్వీసులను మోదీ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులను పెన్షనర్ల పెన్షన్ స్లిప్ లకు సంబంధించిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 25, 2021 / 09:09 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షన్ తీసుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెన్షన్ తీసుకునే వారికి ఊరట కలిగే విధంగా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లు పెన్షన్ స్లిప్ తీసుకోవడానికి బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పెన్షనర్ల కొరకు కొత్త సర్వీసులను మోదీ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కేంద్రం నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.

    కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులను పెన్షనర్ల పెన్షన్ స్లిప్ లకు సంబంధించిన అదేశాలను జారీ చేసింది. పెన్షనర్లు ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పెన్షన్ స్లిప్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బ్యాంక్ కు వెళ్లకుండానే పెన్షన్ స్లిప్ తీసుకోవడం వల్ల పెన్షనర్లకు సమయం ఆదా అవ్వడంతో పాటు ఇతర ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.

    కరోనా విజృంభణ వల్ల ప్రతికూల పరిస్థితులు నెలకొన్న్ తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఊరట కలిగే నిర్ణయాలను తీసుకుంటూ ఉండటం గమనార్హం. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యోగులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ స్లిప్ ఉద్యోగులకు ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి, డియర్‌నెస్ రిలీఫ్ కు పెన్షన్ స్లిప్ తప్పనిసరిగా ఉండాలి.

    పెన్షన్ స్లిప్ లో ఎంత పెన్షన్ వస్తుందనే వివరాలతో పాటు ఏమైనా ట్యాక్స్ కట్ అవుతోందా? అనే వివరాలు సైతం పొందుపరిచి ఉంటాయి. కేంద్రం ఉద్యోగులకు వచ్చే నెల నుంచి డీఏ బకాయిలను చెల్లించనున్న సంగతి తెలిసిందే.