Tech Tips: రోజువారి జీవితంలో మొబైల్ తప్పనిసరిగా మారిపోయింది. నిత్యవసర వస్తువుల లాగే మొబైల్ కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్లోకి కొత్త కొత్త మొబైల్స్ ఎన్ని వచ్చినా.. వీటి ధరలు తగ్గడం లేదు. కొన్ని బ్రాండెడ్ మొబైల్స్ అయితే ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనాలని చూస్తారు. వీరికి అనుగుణంగా కొన్ని షోరూమ్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విక్రయిస్తుంటాయి. అయితే కొందరు మాత్రం మొబైల్స్ ను దొంగలించి ఇతరులకు అమ్మిస్తుంటారు. మరి ఇలాంటి అప్పుడు ఆ మొబైల్ అమ్మేవారు నిజమైన పర్సనైనా? లేదా ఎవరిదైనా దొంగిలించి విక్రయిస్తున్నాడా? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదెలా తెలుసుకోవాలంటే?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేయాలని చాలా తక్కువ మంది చూస్తారు. బ్రాండ్ కలిగిన మొబైల్ కొనాలని అనుకుంటే ఆ ఫోన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు వాడిన లేదా యూస్ చేసిన ఈ ఫోన్ ఒకవేళ చోరీకి గురైంది ఉండవచ్చు. అంటే ఎవరైనా దొంగిలించి ఆ మొబైల్ ను విక్రయించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి చెబుతున్న ప్రకారం ఆ మొబైల్ నిజమైన బ్రాండ్ కలిగినదేనా? లేక పైకి బ్రాండ్ లా కనిపించే ఫేక్ ఫోనా? అని తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు ఒక చిన్న ట్రిక్ యూస్ చేస్తే సరిపోతుంది.
మొబైల్ కొనుగోలు చేసిన తర్వాత అందులో ముందుగా ఈ చిన్న పని చేయాలి. మొబైల్ కి సంబంధించిన ఈఎంఐ ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే డయల్ ప్యాడ్ లో *#06#అని టైప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మొబైల్ కు సంబంధించిన IMEI డిస్ప్లే అవుతుంది. ఈ నెంబర్ను కాపీ చేసిన తర్వాత.. మెసేజ్ బాక్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు 14422 అని నెంబర్ కు KYC అని టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి. ఆ తర్వాత IMEI నెంబర్ ను పేస్ట్ చేసి పంపించాలి. ఇలా చేసిన తర్వాత ఆ ఫోన్ కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అప్పుడు ఆమె వ్యక్తి చెప్పినా ప్రకారమే మొబైల్ ఉందా? లేదా? అని తెలుసుకోవచ్చు.
చాలామంది నాసిరకమైన పరికరాలను అమర్చి పైకి కనిపించే ప్లాట్స్ మాత్రం బ్రాండెడ్ వి అమరుస్తూ ఉంటారు. ఇది ఖరీదైన ఫోన్ అని తెలిపి ఎక్కువగా డబ్బులు తీసుకుంటారు. అయితే పైన చెప్పిన విధంగా చేస్తే ఫోన్ కు సంబంధించిన డీటెయిల్స్ వస్తే.. అప్పుడు ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అయితే సాధ్యమైనంతవరకు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అంతకుముందు వాడిన వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ తో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల సాఫ్ట్వేర్ డ్యామేజ్ అయి ఉంటాయి. అవి తాత్కాలికంగా కనిపించవు. కొన్ని రోజుల తర్వాత బయటపడతాయి. తక్కువ ధరలో అయినా కొత్త ఫోన్ మాత్రమే కొనుగోలు చేయాలి.