Google New AI: మనం ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్లో వెతుకుతాం. అప్పుడు గూగుల్ మన కోసం కొన్ని వెబ్ సైట్ల లింకులను చూపిస్తుంది. ఆ లింకులపై క్లిక్ చేసి వెబ్‌సైట్‌లలోకి వెళ్లి కావాల్సిన సమాచారం చూసుకుంటాం. అక్కడ ఉండే ప్రకటనలను కూడా చూస్తాం. దీనివల్ల వెబ్‌సైట్‌లకు డబ్బులు వస్తాయి. ఇంటర్నెట్ మొదలైనప్పటి నుంచీ ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. ది. దీన్నే సింపుల్ బార్గేన్ అంటారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిని మార్చేస్తోంది. AI వల్ల మనం చూసిన ఇంటర్నెట్ ఇక మీదట అలా ఉండకపోవచ్చు అని కొందరు నిపుణులు అంటున్నారు. నిజంగా AI ఇంటర్నెట్‌ను నాశనం చేస్తుందా? లేక కొత్త రూపాన్ని ఇస్తుందా? అనేది వివరంగా తెలుసుకుందాం.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
ఇంటర్నెట్ స్వభావం పూర్తిగా మారిపోయింది. AI ఇప్పుడు చాలా వెబ్‌సైట్‌లకు జనం వెళ్లడాన్ని ఆపేస్తోందని స్టాక్ ఓవర్‌ఫ్లో అనే కంపెనీ సీఈవో ప్రశాంత్ చంద్రశేఖర్ చెప్పారు. అంటే మనం ఏదైనా సమాచారం అడిగినప్పుడు, AI నేరుగా ఆన్సర్ చేస్తే మనం వెబ్‌సైట్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల వెబ్‌సైట్‌లకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఇటీవల పెర్ప్లెక్సిటీ అనే ఒక AI కంపెనీ కామెట్ అనే కొత్త వెబ్ బ్రౌజర్‌ను రిలీజ్ చేసింది. ఇది స్క్రోల్ చేయడం కంటే మాట్లాడినట్లు ఉంటుంది అని గిజ్మోడో(ఇది ఒక వెబ్ సైట్) చెప్పింది. అంటే, చాలా పేజీలు మనం ఓపెన్ చేసి లింకులపై నొక్కకుండా ఈ బ్రౌజర్ మనం అడిగిన దానికి సరైన సమాధానాన్ని నేరుగా ఇస్తుంది.
అలాగే, ఓపెన్ AI కూడా త్వరలో ఆపరేటర్ అనే తన సొంత AI ఏజెంట్‌ను తీసుకు రాబోతుంది. ఇది మనుషులు వెబ్‌సైట్‌లను చూసినట్లే, నొక్కడం, రాయడం, పైకి కిందకి కదపడం వంటివి చేయగలదని అంటున్నారు. ఈ పోటీలో వెనుకబడకుండా గూగుల్ కూడా తన సెర్చ్ ఇంజిన్‌కు AI మోడ్‌ను తీసుకొచ్చింది. ఇందులో నార్మల్ సెర్చ్ రిజల్ట్స్ కు బదులుగా ఒక చాట్‌బాట్ మన ప్రశ్నలకు చిన్న వ్యాసం లాగా సమాధానం ఇస్తుంది.
ఈ మార్పులు సక్సెస్ అయితే మొత్తం ఇంటర్నెట్ పనితీరునే పూర్తిగా మార్చేస్తాయని గిజ్మోడో చెప్పింది. వార్తలు ఇచ్చేవాళ్లు, ప్రకటనలు ఇచ్చేవాళ్లు, ఆన్‌లైన్‌లో వస్తువులు అమ్మేవాళ్లు, వారి వెబ్‌సైట్‌లు ఈ AI ఏజెంట్లను స్కిప్ చేసే అవకాశం ఉంది. అయితే ఇంటర్నెట్ మాత్రం ఎక్కడికీ పోవడం లేదు. ప్రమాదంలో ఉన్నది ఓపెన్ వెబ్ అని కొందరు భయపడుతున్నారు. ఈ కొత్త ఇంటర్నెట్ సమాధానాలను ఎప్పుడూ సులభంగా ఇస్తుంది కానీ ఓపెన్ వెబ్‌ను ఇంతలా పాపులర్ చేసిన కొన్ని విషయాలకు ముగింపు పలకవచ్చు. అంటే, మనం ఆన్‌లైన్‌లో ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ, అనుకోకుండా కొత్త విషయాలను కనుగొనే అవకాశం కోల్పోవచ్చు. ఇది కేవలం సమాచారం మాత్రమే అందించే ఒక మిషన్ గా మారే అవకాశం ఉంది.