Etela Rajender Speech: అదే ఆగ్రహం.. అదే కట్టలు తెంచుకున్న కోపం.. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం భారత రాష్ట్ర సమితి నుంచి కెసిఆర్ బయటకి పంపించిన తర్వాత.. ఈటెల రాజేందర్ ఇదే స్థాయిలో మాట్లాడారు.. ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టరాని కోపంతో చీల్చి చెండాడారు.. మళ్లీ అదే స్థాయిలో.. అదే ఊపులో.. పార్లమెంట్ సభ్యుడికి ఏమైంది.. అంత పట్టరాని కోపం ఎందుకు వచ్చింది.. ఇప్పుడు ఇవే తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారి తీస్తున్నాయి.
Also Read: బతికుండగానే చావు చివరి అంచు దాకా తీసుకెళ్లారు..గుండెను బరువెక్కించే వీడియో
ఈటల రాజేందర్ శాంతంగా ఉంటారు. ప్రశాంతంగా మాట్లాడుతుంటారు. వచ్చిన కార్యకర్తలతో కులాసాగా ఉంటారు. కుశల ప్రశ్నలు వేస్తుంటారు. కడుపునిండా భోజనం పెడతారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారు. తన పరిధిలో అప్పటికప్పుడు అవి సాధ్యమవుతాయి అనుకుంటే వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తుంటారు. అందు గురించే ఆయనను మాస్ లీడర్ అని పిలుస్తుంటారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన హుజరాబాద్ లో ఊహించని స్థాయిలో రాజేందర్ కు ఓటమి ఎదురైంది. ఈ ఓటమిని రాజేందర్ జీర్ణించుకోలేకపోయారు. ఆయన అనుచరులు తట్టుకోలేకపోయారు. దీంతో ఒకానొక దశలో రాజేందర్ డైలమాలో పడ్డారు. ఆ తర్వాత మల్కాజ్ గిరి స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశారు. తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీ ఓటమికి పార్లమెంట్ విజయం ద్వారా బదులు తీర్చుకున్నారు. అయినప్పటికీ రాజేందర్ మనసులో ఏదో ఒక వెలితి ఉంది. పైగా తన సొంత నియోజకవర్గంలో కేడర్ మొత్తం ఇబ్బంది పడుతోంది. దీంతో ఆయన సమయం దొరికిన ప్రతి సందర్భంలో నియోజకవర్గానికి వెళ్లి వస్తున్నారు. క్యాడర్ తో మాట్లాడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఇటీవల కరీంనగర్ లో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం హుజరాబాద్ లో మాత్రమే మెజారిటీ తగ్గిందని.. ఇక్కడ అలా తగ్గడం వెనక కారణం ఏంటని.. కొంతమంది వ్యక్తులు ఇలా చేస్తున్నారని ఆయన పేరు చెప్పకుండానే విమర్శలు చేశారు. ఇలా ఓట్లు తగ్గడ వెనుక కొందరి కుట్ర ఉందని ఆయన మండిపడ్డారు.. ఆయన మాట్లాడిన మాటలను కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. అవన్నీ కూడా రాజేందర్ ను ఉద్దేశించి చేసినవని మంట పెట్టే ప్రయత్నం చేశాయి. బండి చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత రాజేందర్ స్పందించారు.. తన ఆగ్రహాన్ని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు.. బి కేర్ఫుల్ నా కొడకా.. అంటూ మండిపడ్డారు. రాజేందర్ చేసిన ఆ వ్యాఖ్యలు ముమ్మాటికి బండి సంజయ్ ని ఉద్దేశించినవేనని గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా బ్యాచ్ ప్రచారం చేస్తోంది. భారతీయ జనతా పార్టీలో ముసలం మొదలైందని.. స్థానిక ఎన్నికల నాటికి ఆ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెబుతోంది.
Also Read: పిఠాపురంలో వర్మను నమ్ముకున్న వైసిపి..’గీత’ దాటనున్నారా?
రాజేందర్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విభాగం మరో విధంగా ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా కెసిఆర్ ను ఉద్దేశించి రాజేందర్ చేసిన వ్యాఖ్యలని.. దీనిని మరో వ్యక్తికి ఆపాదించాల్సిన అవసరం లేదని.. అడ్డగోలుగా ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విభాగం హెచ్చరిస్తోంది. రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ వర్గీయులు పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం విశేషం. దీనిని బట్టి పార్టీలో ఏం జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.