Parenting: సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారిని ఒక్క క్షణం కూడా ఎక్కడా వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలను ఓవర్‌గా ప్రొటెక్ట్ చేస్తుంటారు. అంటే వారిని ఒక్క క్షణం కూడా వదలకుండా, ఎక్కడికి పంపించకుండా వారితోనే ఉండాలని భావిస్తారు. అయితే పిల్లలను ప్రొటెక్ట్ చేయడం మంచిదే. కానీ అది పరిమితులకు మించితే.. పిల్లలకు పేరెంట్స్ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. జైలులో ఉన్నట్లు పిల్లలు ఫీల్ అవుతారు. పిల్లలు వారి సొంత నిర్ణయాలపై ఉండాలని తల్లిదండ్రులే నేర్పించాలి. కానీ కొందరు పిల్లలను ఓవర్‌గా ప్రొటెక్ట్ చేస్తూ.. వారికి నచ్చినట్లే ఉంటారు. దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బందిపడతారు. చిన్న వయస్సులో మీరు చెప్పిన మాట వింటారు. కానీ అది మీ మీద గౌరవంతో అయితే కాదు. పిల్లల మంచి కోసం ఆలోచిస్తూ.. వారి సొంత నిర్ణయాలను తల్లిదండ్రులు గౌరవించాలి. అప్పుడే వారు జీవితంలో ఏదైనా సాధించగలరనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే పిల్లలను తల్లిదండ్రులు ఓవర్‌గా ప్రొటెక్ట్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏ డ్రస్సు వేసుకోవాలి? ఏం తినాలని కూడా వారే నిర్ణయిస్తారు. కనీసం వారికి ఇష్టమైన ఆహారం తీనే ఛాన్స్ కూడా ఇవ్వరు. దీనివల్ల వారికి సొంత నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఎప్పటికి ఎవరో ఒకరు తోడు ఉండరు. కాబట్టి పిల్లల అభిప్రాయాలను కూడా గౌరవించండి. వారి నిర్ణయాలు తీసుకునే అవకాశం పిల్లలకు ఇవ్వండి. తప్పు అయితే వారికి అర్థమయ్యేలా తెలియజేయండి. అంతే కానీ ఓవర్‌గా ప్రొటెక్ట్ చేయవద్దు. అన్ని విషయాలు మీరే చెప్పడం వల్ల వారికి ఎలాంటి విషయాలు తెలియవు. అన్నింటికి ఇతరులపై ఆధారపడేలా మీరు పిల్లలకు నేర్పించిన వారు అవుతారు. కాబట్టి పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వండి. కానీ అతి మితిమీరకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే.
సాధారణంగా పిల్లలకు ఆటలంటే ఇష్టం. కానీ కొందరు తల్లిదండ్రులు ఆడితే దెబ్బలు తగులుతాయని అసలు ఆడనివ్వరు. ఇలా పిల్లలను ఓవర్‌గా ప్రొటెక్ట్ చేస్తే శారీరకంగా వారు ఆరోగ్యంగా ఉండరు. వారి వయస్సు గల పిల్లలతో కాసేపు అయిన ఆడుకోవడానికి పర్మిషన్ తల్లిదండ్రులు ఇవ్వాలి. ఆటలు, పాటలు, చదువు ఇలా వారికి ఇష్టమైన రంగంలో ముందుకు వెళ్లేందుకు తల్లిదండ్రులే సాయం చేయాలి. పిల్లలు మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే వ్యాయామం, గేమ్స్ అన్ని సాయపడతాయి. పిల్లలకు అవన్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులే నేర్పించాలి. వ్యాయామం చేయడం వల్ల పిల్లలు అలసి పోతారని వారి మీద ప్రేమతో పూర్తిగా వాటికి దూరంగా ఉంచవద్దు. ఇలా ఓవర్‌గా పిల్లలను ప్రొటెక్ట్ చేస్తే పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తల్లిదండ్రులే పిల్లలను ఒక జెమ్‌గా తయారు చేయాలి. కాబట్టి అన్ని విషయాల్లో పిల్లలకు కండిషన్లు పెట్టవద్దు. ఏ వయస్సులో అయిన పిల్లలకు ప్రొటెక్ట్ అవసరమే. కానీ అది ఓవర్ కాకూడదు. కాబట్టి పిల్లల విషయంలో ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.