https://oktelugu.com/

Apple IOS: కొత్త ఫీచర్లతో మంత్రముగ్ధులను చేయబోతున్న యాపిల్ ఇంటెలిజెన్స్

యాపిల్ ఇంటెలిజెన్స్ మొదటి దశ ఇటీవలే మొదలు కాగా, రెండో దశ విడుదలకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఈ ఐవోఎస్ 18.2 వెర్షన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తున్నది.

Written By:
  • Mahi
  • , Updated On : November 4, 2024 / 12:51 PM IST

    Apple IOS

    Follow us on

    Apple IOS: భారత మార్కెట్ లో యాపిల్ ఉత్పత్తుకు క్రేజ్ మరింత పెరిగింది. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం యాపిల్ ఐవోఎస్ 18.1ని మార్కెట్ లో విడుదల చేసింది. అయితే ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ తో డిసెంబర్ లో మరో లేటెస్ట్ వెర్షన్ ను అందుబాటులో కి తేనున్నట్లు తెలుస్తున్నది. ఐవోఎస్ 18.2 రాకను కూడా ఇది ధ్రువీకరించినట్టుగా తెలుస్తున్నది. అయితే ముందుగా ఆస్ర్టేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బ్రిటన్ సహా అన్ని ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో దీనిని డిసెంబర్లో అందుబాటులోకి తేవాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో ఈ వెర్షన్ అందుబాటులోకి వస్తున్నది. ఈ అప్ డేట్ వెర్షన్లో ఇమేజ్ జనరేషన్ ఫీచర్స్ తో పాటు జెన్ మోజీ మరియు ఇమేజ్ ప్లే గ్రౌండ్ తదితర టూల్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. ఇది చాట్ జీపీటీని లోతుగా ఏకీకృతం చేస్తుంది. ఇందులో ఇమేజ్ ప్లే గ్రౌండ్ విషయానికి వస్తే యానిమేషన్, ఇలస్ర్టేషన్, స్కెచ్ అనే మూడు ఫీచర్లు ఉన్నాయి. ఇక జెన్ మోజీ అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. ఇది మాటకు అనుగుణంగా మనకు సరైన ఎమోజీని తయారు చేసుకోవడానికి సహకరిస్తుంది. ఇక చాట్ జీపీటీ ఇమిగ్రేషన్ మీకు సిరితో ఇంటరాక్ట్ అయినప్పుడు చాట్ జీపీటీతో కమ్యూనికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు చాట్ జీపీటీ రైటింగ్ టూల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

    మనం రాసే అంశాల ఆధారంగా వచన మాటలను రూపొందించడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. యాపీల్ 18.2 ప్రారంభోత్సవంలో భాగంగా ప్రాధాన్యత నోటిఫికేషన్లను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఐఫోన్ 16 కెమెరా కంట్రోల్ అప్ గ్రేడ్ లు ఐవోఎస్ 18.2వెర్షన్ తో పనిచేస్తాయని చెప్పవచ్చు.

    ఐఫోన్ 16. ఐఫోన్ 16 ప్రో కెమెరాలు ఇక రెండు దశల షట్టర్ దశల మోడ్ ను పొందుతాయి. ఇక ఈ రెండు వెర్షన్ల ఫోన్లలో మరో ఫీచర్ అందుబాటులో కి రాబోతున్నది. ఇదే విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. ఐవోఎస్18.2లో కొత్త మొబైల్ యాప్ డిజైన్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తున్నది.
    యాపిల్ఇంటెలిజెన్స్ 18.2లో ముఖ్యమైనది సిరిచాట్ జీపీటీ. ఇది పూర్తిగా ఐచ్చిక ఫీచర్.

    మనం చూస్తున్న చిత్రాలకు సంబంధించిన ప్రశ్నలను దీనిద్వారా అడగవచ్చు. ఇక విజువల్ ఇంటెలిజెన్స్, జెన్ మోజీ, రైటింగ్ టూల్స్, ఇమేజ్ ప్లే గ్రౌండ్ , భాషల వినియోగం తదితర ఫీచర్లు ఆకట్టుకోనున్నట్లు సమాచారం.