https://oktelugu.com/

The Baby in This Photo: ఈ ఫొటోలో ఉన్న బేబీ.. దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తోంది.. కుర్రాళ్ల ఫేవరెట్ అయిన ఈ హీరోయిన్ ఎవరంటే? 

సినీ ప్రపంచం అందమైనదని చాలా మంది భావన. అందుకే ఈ పరిశ్రమలో ఛాన్స్ దక్కడానికి ఆరాటపడుతూ ఉంటారు. కొందరికి అనుకోని అవకాశం కూడా వస్తుంటుంది. అయితే ఎలాగోలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 4, 2024 / 01:00 PM IST

    Tabu

    Follow us on

    The Baby in This Photo: సినీ ప్రపంచం అందమైనదని చాలా మంది భావన. అందుకే ఈ పరిశ్రమలో ఛాన్స్ దక్కడానికి ఆరాటపడుతూ ఉంటారు. కొందరికి అనుకోని అవకాశం కూడా వస్తుంటుంది. అయితే ఎలాగోలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతారు. మరికొందరు కొన్నాళ్లు అలరించి.. ఆ తరువాత కనుమరుగైపోతారు. ముఖ్యంగా హీరోయిన్లు తమకు గ్లామర్ ఉన్నంత వరకు  ఆడి.. .పాడి.. పెళ్లయిన తరువాత సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోతారు. అయితే దాదాపు 30 ఏళ్ల కింద ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన  ఓ హీరోయిన్ ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే ఈ భామ ఇప్పటికీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. దీంతో తనకువ వచ్చిన అవకాశాలను వదులుకోవడం లేదు. అయితే తాజాగా ఫొటోషూట్ కు ఫోజులిచ్చింది. దీంతో ఆమె అందం ఇంకా తగ్గేదేలే.. అన్నట్లుగా ఉంది. అంతేకాకుండా ఆమె చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
    1980ల కాలంలో వచ్చిన సినిమాల్లో కొందరు హీరోయిన్లు తమ అందాలతో ఆకట్టుకున్నారు. అప్పట్లో హీరోయిన్ల మధ్య పోటీ తక్కువగా ఉండడంతో ఉన్న వారికే అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీలో అవకాశం వచ్చినా సినిమాలు చేసేవారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పుట్టి, పెరిగిన ఓ హీరోయిన్ పెద్దయ్యాక తెలుగుతో పాటు హీందీ సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు టబు.
    ఒకప్పుడు టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా షస్మీ. ఈమె 1971 నవంబర్ 4న  హైదరాబాద్ లో  జన్మించారు.ఆ తరువాత ఇక్కడే పెరిగిన ఈమె సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హిందీ పరిశ్రమలోకి వెళ్లారు. ఇక్కడ మొదటిసారి 1985లో ‘హమ్ నౌజవాన్’ అనే సినిమాలో కనిపించారు. ఆ తరువాత వెంటనే తెలుగు సినిమా కూలీనెంబర్ 1 లో హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ సినిమా సూపర్ హిట్టు కొట్టడంతో టబుు అవకాశాలు వచ్చా.ి అయితే 1996లో  ‘మాచిస్ ’ అనే సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇక తెలుగులో నిన్నె పెళ్లాడుతా, ప్రేమదేశం, చెన్నకేవశరెడ్డి, అందరివాడు, పాండురంగడు వంటి సినిమాల్లో నటించారు.
    కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చినా తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ టబు కనిపించారు. లేటేస్ట్ గా తెలుగులో ‘అలా వైకుంఠపురం’ సినిమాలో తల్లిపాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా హిందీలో అజయ్ దేవ్ గన్ తో కలిసి క్రూ సినిమాలో కనిపించారు. అయితే టబుకు ప్రస్తుతం 52 ఏళ్లు. కొన్ని కారణాల వల్ల ఈ భామ పెళ్లి చేసుకోలేదు. కానీఆమె అందం మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉందని కొందరు కొనియాడుతున్నారు.
    టబు సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఫొటో షూట్ కు ఫోజులిచ్చారు. ఇందులో టబు హాట్ హాట్ గా కనిపిస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికే అలాగే ఉన్నారని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు టబు ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ టబు మాత్రం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.