Instagram PG-13 filters: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వీడియోలను చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. కొందరు వ్యూస్ పెంచుకొని పాపులర్ కావాలన్న ఉద్దేశంతో హద్దులు మీరి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అడల్ట్ కంటెంట్ కూడా ఉంటున్నాయి. అయితే వీటిని అరికట్టడానికి ఇంస్టాగ్రామ్ మాత సంస్థ అయిన మెటా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లలు అడల్ట్ కంటెంట్ చూడకుండా ఉండేందుకు ఆటోమేటిక్ రిస్ట్రిక్షన్స్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వివరాల్లోకి వెళ్తే..
ఇంస్టాగ్రామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రకరకాల వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. టిక్ టాక్ యాప్ కు ప్రత్యామ్నాయంగా ఇంస్టాగ్రామ్ ఉండడంతో చాలామంది దీనికి అలవాటు పడిపోయారు.. మారుమూల గ్రామాల్లో సైతం చాలామంది వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. అయితే వీడియోలు చేసే క్రమంలో కొందరు హద్దులు వీరి 18 ప్లస్ కంటెంట్లు చేస్తున్నారు. దీంతో కొంతమంది యువత చెడిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువత ఇలాంటి వీడియోలు చూడకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని ఇప్పటికే సూచనలు చేశారు. అయినా కూడా కొంతమంది మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రకరకాల వీడియోలు చూస్తున్నారు. అయితే దీనిపై తాజాగా మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏదైనా అడల్ట్ లేదా వయోలెన్స్ కంటెంట్స్ ఉంటే వాటిని చూడకుండా ముందుగా వయసు అడుగుతుంది. తమ వయసు గురించి తెలిపిన తర్వాత ఆ వీడియో ఓపెన్ అవుతుంది. ఒకవేళ 18 ప్లస్ వారు అయితే తమ ఏజ్ గురించి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ డేట్ అఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాతనే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. అయితే అంతకుముందు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంస్టాగ్రామ్ వీడియోలు చూడకుండా అడ్డుకోవాలని తెలిపింది. ఇప్పటికే టీవీలో పిల్లలు చూడలేని కంటెంట్లు ఓపెన్ కాకుండా ఏజ్ ప్రూఫ్ నిబంధన పెట్టింది. ఒక వీడియో ఓపెన్ చేయాలంటే సరైన ఏజ్ పై క్లిక్ చేస్తేనే ఆ వీడియో ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లోను ఈ నిబంధన తీసుకొచ్చింది. అయితే కొంతమంది యువత తమ వయసు తక్కువగా ఉన్నా కూడా.. ఎక్కువ అని ప్రెస్ చేసి వీడియోను చూసే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి వీడియోలు చూస్తున్నారో అబ్జర్వేషన్ లో పెట్టాలని తెలుపుతున్నారు. ఇటీవల చాలామంది యువత పక్క దారి పట్టడానికి సోషల్ మీడియాని కారణమవుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. అందువల్ల ముందు జాగ్రత్తగా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వీడియోలో చూడకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు.