Smartphone Health Tips: ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి పనిని మొబైల్ తోనే చేస్తున్నారు. కొందరు మొబైల్ లేకుండా క్షణం కూడా గడపడం లేదు. ఫోన్ ద్వారా కాలక్షేపంతో పాటు ఉద్యోగం చేయడానికి కూడా మార్గం ఉండడంతో చాలామంది దీనికి అలవాటు పడిపోయారు.. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు. చాలామంది స్మార్ట్ ఫోన్ చూసి అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పటికే మొబైల్ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చాయి. అయితే తాజాగా కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం మొబైల్లో చేతిలో పట్టుకునే విధానంతో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అవి ఏంటంటే?
సాధారణంగా మొబైల్ లో ఎవరైనా చేతిలో పట్టుకొని తలా వాల్చి చూస్తూ ఉంటారు. అలా తల వాల్చి చూడడం వల్ల మెడలోని బోన్స్ అరిగిపోతాయని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక్కోసారి మనకు నచ్చిన వీడియోలు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే గంటల తరబడి ఇలా మెడ వాల్సి చూస్తూ ఉంటాం. ఇలా చూడడం వల్ల డిప్రెషన్ కు లోను కావడమే కాకుండా.. రోగనిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కువసేపు ఇలా ఫోన్ పట్టుకొని ఉండటంవల్ల వెన్నెముక కూడా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక అదే పనిగా ఇలా మెడ వచ్చి ఫోన్ చూడడం వల్ల మెదడుపై కూడా ప్రభావం పడి డిప్రెషన్కు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇలా ఫోన్ పట్టుకొని కిందికి వాల్చడం వల్ల భవిష్యత్తులో వారు వంగినట్లు కనిపిస్తారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అయితే తప్పనిసరిగా ఫోన్ చూడాలని అనుకున్నప్పుడు కనీసం నిమిషానికి ఒకసారి అయినా తల పైకి లేపుతూ ఉండాలి. లేదా ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. అదేపనిగా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కూడా కళ్ళపై ఎఫెక్ట్ పడి మెదడు దెబ్బతిని అవకాశం ఉంటుంది.
మరి ఫోన్ చూడాలంటే ఎలా చూడాలి? అన్న సందేహం కొందరికి వస్తుంది. మన తల సాధారణంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో.. అక్కడికే ఫోన్ తీసుకెళ్లి చూడాలి. అంటే ఫోన్ పైకెత్తి చూడడం వల్ల కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే రాత్రి సమయంలో చీకట్లో ఫోన్ చూడకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ టైంలో ఫోన్ నుంచి వచ్చే స్క్రీన్ లైట్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ స్క్రీన్ లైట్ కళ్ళపై పడి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటినుంచి అయినా ఫోన్ వాడకంలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఫోన్ మాట్లాడే సమయంలో ఫోన్ ను పైకెత్తి మాట్లాడాలి.