Indias internal enemies 2025: వాస్తవానికి మన దేశానికి ప్రధమ శత్రువులు చైనా పాలకులు, పాకిస్తాన్ పాలకులు అంటుంటాం. ఇందులో వాస్తవం కూడా ఉంది. కానీ ఈ రెండు దేశాల కంటే మన దేశానికి ప్రథమ శత్రువులు చాలామంది ఉన్నారు. ఆ శత్రువులు మనవాళ్లే కావడం అత్యంత విషాదం. ఈ మాట అనడానికి.. ఈ వాక్యం రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక దేశానికి వెన్నుపోటు పొడిచే వ్యక్తుల కంటే ప్రథమ శత్రువులు ఎవరుంటారు.. ఇప్పుడు అలాంటి ఆర్థిక వెన్నుపోటు పొడుస్తూ.. మన దేశ ప్రజల అవసరాల మీద దెబ్బ కొడుతూ.. లేనిపోని ఆశలను కల్పిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. సొంత దేశంలో ప్రజలు ఆర్థికంగా నష్టపోతుంటే రాక్షసానందం పొందుతున్నారు.
Also Read:China Rains: చైనా మునిగింది.. వీడియో గూస్ బాంబ్స్
ఇంతకీ ఏం జరిగిందంటే
జనాభాపరంగా ప్రపంచంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. వినియోగదారుల మార్కెట్ పరంగా కూడా మన దేశం ప్రపంచంలోనే అతిపెద్దది. అందువల్లే చైనా, హాంకాంగ్, ఇతర దేశాల అక్రమార్కులు నడిపించే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లలో మనదేశ యువకులు పనిచేస్తున్నారు. మన దేశ సెలబ్రిటీలు ఆ కంపెనీలకు ప్రమోషన్ చేస్తున్నారు.. తద్వారా భారీగా సంపాదిస్తున్నారు. మన దేశ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు.. మనదేశ యువకులు ఆర్థికంగా చితికిపోయినా పర్వాలేదనుకోని వీరు అడ్డగోలుగా దందా చేస్తున్నారు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు 2020 లోనే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లపై కేసులు నమోదు చేశాయి. ఈ కేసులలో దర్యాప్తునకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున నగదు విదేశాలకు వెళ్ళినట్టు సమాచారం. అయితే ఈ దందాలో చైనా కంపెనీలకు మనదేశ సెలబ్రిటీలు, ఇంకా కొంతమంది వ్యక్తులు సహకరించినట్టు తెలుస్తోంది. పైగా ఈ నగదును క్రిప్టో కరెన్సీగా మార్చి హాంకాంగ్ వంటి ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. పేరూ ఊరూ లేని కంపెనీలకు ఏకంగా 443.60 కోట్లు తరలించారు అంటే మోసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎస్ బీ ఐ అధికారులు సహకరించారు
ఇక ఈ దందాలో లింకున్ , డోకిపే ద్వారా అనేక కంపెనీలకు నగదు పంపించారు. ఆసియా పసిఫిక్ కార్గో కంపెనీ, రేడియంట్ స్పార్క్, ఎచివర్ బ్రిజ్ ఇంటర్నేషనల్, కనెక్టింగ్ వరల్డ్ వైడ్, జెనెక్స్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలకు ఏకంగా 85.95 కోట్లను చేరవేశారు. ఇక ఈ నగదు చేరవేతలో పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ అధికారులు సహకరించారు. మన దేశానికి చెందిన 26 సంస్థలు, ఇతర వ్యక్తులు ఈ దందాకు సహకరించారని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. వందమంది శత్రువుల కన్నా ఒక వెన్నుపోటు దారు అత్యంత ప్రమాదం. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ తర్వాత పై వాక్యం నిజమే అనిపిస్తుంది.