iQ00 13: IQ00 13 మోడల్ ఫోన్ 54,999 కు లభ్యమవుతోంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఉంది. దాని ద్వారానే ఈ ఫోన్ నడుస్తుంది. అత్యంత సూక్ష్మమైన దృశ్యాలు కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. దానికోసం ఫ్లోటింగ్ లైట్ రింగ్ ఉంటుంది. ఈ ఫోన్ చార్జింగ్ పూర్తయిన తర్వాత నీలం రంగులోకి మారుతుంది. ఎల్ఈడీ రింగ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఇది 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీతో నడుస్తుంది. 120 వాట్స్ సామర్థ్యం గల చార్జర్ ను ఈ ఫోన్ తో దీని తయారీ సంస్థ అందిస్తోంది. అయితే బాక్సియర్ లుక్ లో కనిపించినప్పటికీ వెనుక ప్యానల్ మాత్రం కాస్త వంకర నిర్మాణాన్ని పోలి ఉంటుంది.. దీని స్మడ్జ్ వేలిముద్ర గుర్తులను భద్రపరచడంలో తోడ్పడుతుంది. ఇది నీరు, ధూళి ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ప్రమాదవశాత్తు వర్షంలో తడచినా, నీటుగా మునిగినా ఎటువంటి డ్యామేజ్ కాదు. పైగా ఆడియో అవుట్ ఫుట్ నిజమైన స్టీరియో స్పీకర్ లాగా ఉంటుంది. ఇది 6.8 2 అంగుళాల ప్లాట్ ఓఎల్ఈడీ ప్యానల్ ను కలిగి ఉంటుంది. 2కె రిజల్యూషన్ లో లభిస్తుంది. 144 హెచ్ జెడ్ రి ఫ్రెష్ రేటు తో అత్యంత వేగంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రో కంటే వేగంగా పనిచేస్తుంది.
బ్యాటరీ ఆదా చేయడానికి
ఈ ఫోన్ బ్యాటరీని ఆధార్ చేయడానికి రిజల్యూషన్ ను “1080 పీ” కి సెట్ చేశారు. అయితే మెరుగైన డిస్ ప్లే కావాలంటే దానిని 2కే కు మార్చుకోవచ్చు. ఇది వెట్ హ్యాండ్ కంట్రోల్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అలాంటప్పుడు తడిచేత్తో స్క్రీన్ ని టచ్ చేసినప్పటికీ అది పనిచేస్తుంది. అయితే ఈ ఫీచర్ ఆపిల్, సామ్ సంగ్ వంటి వాటిల్లో కూడా లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేవారికి, గేమ్స్ ఆడే వారికి రిజల్యూషన్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది.. ఇందులో వెనుక వైపు మూడు 50 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో అల్ట్రావైడ్, 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ టెలి ఫోటో కెమెరా కాస్త అప్డేట్ వర్షం ఇస్తే బాగుండేది. లాంగ్ షాట్స్ క్లిక్ చేయడం టెలిఫోటో కెమెరా వల్ల సాధ్యం కాకపోవచ్చు. అయితే లైటింగ్ ఎలా ఉన్నప్పటికీ ఈ ఫోన్ ద్వారా ఫోటోలు తీసుకోవచ్చు. వీటిలో రెండు కెమెరాలు 30 ఎఫ్.పి.ఎస్ వద్ద 8కే రిజల్యూషన్, వీడియోలను 60ఎఫ్పీఎస్ 4 కే క్వాలిటీతో షూట్ చేయవచ్చు.. ఈ ఫోన్ “16 జీబీ రామ్, 512 జీబీ యూఎఫ్ ఎస్ 4.0” ఇంటర్నల్ మెమరీ తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ కాస్త వంకర తిరిగి ఉండడమే ఈ ఫోన్ కు ఉన్న ప్రధాన మైనస్ పాయింట్ లో ఒకటి.. మిగతా విషయాలలో ఈ ఫోన్ కు వంక పెట్టడానికి లేదు. పైగా ఇది అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. అయితే ఈ ఫోన్ విక్రయాలను పెంచుకోవడానికి తయారీ సంస్థ భారీగా ఆఫర్లు ప్రకటించింది. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇచ్చింది.