https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు ఆ విషయం లో సక్సెస్ కాలేకపోయాడానికి గల కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కృష్ణ స్టార్ హీరోగా వెలిగొందాడు. ఇక ఆయన తదనంతరం వాళ్ళ ఫ్యామిలీ నుంచి తన పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయనకు సినిమా ఇండస్ట్రీ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 10:00 AM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కృష్ణ స్టార్ హీరోగా వెలిగొందాడు. ఇక ఆయన తదనంతరం వాళ్ళ ఫ్యామిలీ నుంచి తన పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయనకు సినిమా ఇండస్ట్రీ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక తర్వాత చిన్న కొడుకు అయిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నాడు.

    సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోలందరితో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈయన ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తద్వారా ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలి అనే ధోరణిలో ఆయన ఇప్పటినుంచే ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు మహేష్ బాబు భారీ ప్రయోగాలైతే చేశాడు. నిజానికి ఇప్పుడున్న స్టార్ హీరోలు ఎవ్వరు చేయలేని విధంగా తను డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తూ సినిమాని సక్సెస్ చేయాలనే దిశగా ముందుకు దూసుకెళ్లాడు. కానీ ఆయన చేసిన ప్రయోగాలు ఏవి అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో ఆయన రెగ్యూలర్ కమర్షియల్ సినిమాల వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాడు. ఇక ఆయన కెరియర్ లో నాని, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు ప్రయోగాత్మకమైన సినిమాలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.

    మరి ఈ సినిమాల ద్వారా ఆయన ప్రేక్షక లోకానికి ఏదో ఒకటి కొత్తదనం అయితే అందించాలనే ప్రయత్నం చేశాడు. కానీ ప్రేక్షకులు ఆ సినిమాలను రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. దాంతో ఆయన ఎలాంటి సినిమా చేస్తే ఇప్పుడున్న ప్రేక్షకుడికి రీచ్ అవుతుందనే ధోరణిలో ఆలోచించి అలాంటి సినిమాలను మాత్రమే చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక ఏది ఏమైనా మహేష్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాడనే చెప్పాలి. మరి ఆయన లాంటి నటులు ఇండస్ట్రీలో రాణిస్తూ స్టార్ హీరోలుగా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా మంచి విషయం. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబుకి ఒక తీరని లోటు ఏదైనా ఉంది అంటే ఆయన ఎక్స్పరిమెంట్లు చేశాడు.

    కానీ అవి ఏ మాత్రం సక్సెస్ లను సాధించకపోవడం వల్ల ఆయన చాలా తీవ్రమైన నిరాశకు గురయ్యారట. మరి ఆ సినిమాలు కనుక బాగా ఆడుంటే ఆయన నుంచి మరిన్ని ఎక్స్పరిమెంట్ సినిమాలు వచ్చిండేవి అని కొంత మంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు…