https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ ఫౌజి మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 09:55 AM IST

    Prabhas

    Follow us on

    Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా యావత్ భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి సందర్భంలో చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా స్టార్ హీరోలుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు…

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఏ స్టార్ హీరో దక్కించుకొని క్రేజ్ ను ఆయన సొంతం చేసుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియా మొత్తం ప్రభాస్ జపం చేస్తున్నారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తే చూడడానికి ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మీదట ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరో రాబోయే కాలంలో ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడి దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాలా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అన్నగా ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉందట.

    మరి ఆ క్యారెక్టర్ లో కొంతమంది హీరోలను తీసుకోవాలని దర్శకుడు అనుకుంటున్నప్పటికి ఇంకా ఫైనల్ అయితే కాలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ క్యారెక్టర్ లో కన్నడ ‘సూపర్ స్టార్’ అయిన ‘శివరాజ్ కుమార్’ ని తీసుకోవాలనే ఉద్దేశ్యంలో దర్శకుడు హను రాఘవ పూడి ఉన్నట్టుగా తెలుస్తోంది.

    మరి శివరాజ్ కుమార్ కి ఇండియా వైడ్ గా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. మరి తను అనుకున్నట్టుగా ఈ క్యారెక్టర్ లో శివన్నను తీసుకుంటే మాత్రం ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుందనే చెప్పాలి. మరి ఈ క్యారెక్టర్ కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉందా లేదంటే చిన్నగా వచ్చిపోయే క్యారెక్టరేనా అనేది తెలియాలంటే దర్శకుడు ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ఏది ఏమైనా కూడా కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కనక నటించినట్లైతే ఈ సినిమా ఆటోమేటిగ్గా భారీ అంచనాలను రేకెత్తించడమే కాకుండా వాటికి తగ్గ కలెక్షన్స్ ని కూడా సంపాదించి పెడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…