https://oktelugu.com/

GMail : Gmail Inbox నిండిపోయిందా? ఈ చిన్న ట్రిక్ ద్వారా 10 సెకండ్లలో క్లీన్ చేసుకోండి..

ప్రతీ జీమెయిల్ లో 15 జీబీ వరకు స్టోరేజ్ ఇస్తారు. ఇది నిండిన తరువాత కొత్త మెయిల్స్ రావు. దీంతో జీమెయిల్ ను క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ మెసెజ్ లు జీమెయిల్ కు వస్తుంటాయి. వీటిని వెతుక్కోవడం కష్టంగా మారుతుంది. దీంతో పర్సనల్ జీమెయిల్ ను ఎప్పటికప్పుడుూ క్లీన్ చేసుకుంటూ అవసరమైన మెసేజ్ లు మాత్రమే ఉంచుకోవాలి

Written By:
  • Srinivas
  • , Updated On : July 27, 2024 / 04:23 PM IST
    Follow us on

    GMail : నేటి కాలంలో విద్యార్థులు, ఉద్యోగులకు కమ్యూనికేషన్స్ తప్పనిసరి. సమాచారాలను ఇచ్చిపుచ్చుకోవడానికి వాట్సాప్ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. కానీ కొన్ని పర్సనల్, ఇంపార్టెంట్ మెసేజ్ లు పంపించుకోవాలంటే జీ మెయిల్ తప్పనిసరి. వాట్సాప్ అందుబాటులోకి రాకముందు కమ్యూనికేషన్స్ లో జీమెయిల్ ప్రధానంగా నిలిచేది. ఎటువంటి సమాచారం, ఫైళ్లను పంపించుకోవాలన్నా జీ మెయిల్ ను ఉపయోగించేవాళ్లు. అయితే జీమెయిల్ తో ఫైళ్లను పంపించుకోవాలంటే ప్రాసెస్ ఎక్కువవుతుంది. కానీ జీమెయిల్ ద్వారా ఫైళ్లు ఎంతో సేఫ్ గా ఉంటాయి. ప్రస్తుత కాలంలో జీమెయిల్ ఓపెన్ కావాలంటే ఫోన్ మెసేజ్, 2 స్టెప్ వెరిఫికేషన్ లాంటి భద్రతను కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎంత పెద్ద ఫైల్ అయినా పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని కార్యాలయాల్లో, అధికారిక మెసేజ్ లు జీమెయిల్ నుంచే పంపిస్తారు. ఇతర యాప్ లను హ్యాక్ చేసినంతగా.. జీమెయిల్ ను ఎవరూ హ్యాక్ చేయడానికి ఆస్కారం తక్కువ అందువల్ల జీమెయిల్ కు ప్రాధాన్యం తగ్గడం లేదు. అఫీషియల్స్ చాలా మంది ఇప్పటికీ జీమెయిల్ ను మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే జీమెయిల్ కు పర్సనల్ మెసేజ్ లతో పాటు కంపెనీ, ఇతర సోషల్ మీడియా మెసేజ్ లు చాలా వరకు వస్తుంటాయి. ఒక్కోసారి జీమెయిల్ స్టోరేజీ నిండిపోతుంది. అయితే దీనిని క్లీన్ చేసుకోవడానికి సరైన సమయం ఉండదు. ఒక్కో మెసేజ్ చూడడం కష్టతరంగా మారుతంది. మరి దీనిని క్షణాల్లో క్లీన్ చేసుకోవడం ఎలా? ఆ ట్రిక్ ఏంటి?

    ప్రతీ జీమెయిల్ లో 15 జీబీ వరకు స్టోరేజ్ ఇస్తారు. ఇది నిండిన తరువాత కొత్త మెయిల్స్ రావు. దీంతో జీమెయిల్ ను క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ మెసెజ్ లు జీమెయిల్ కు వస్తుంటాయి. వీటిని వెతుక్కోవడం కష్టంగా మారుతుంది. దీంతో పర్సనల్ జీమెయిల్ ను ఎప్పటికప్పుడుూ క్లీన్ చేసుకుంటూ అవసరమైన మెసేజ్ లు మాత్రమే ఉంచుకోవాలి.
    ఇప్పుడున్న పరిస్థితుల్లో నడవడానికే బద్ధకం ఉంటుంది. అలాంటిది నిండిపోయిన జీమెయిల్ బాక్స్ ను క్లీన్ చేయడానికి సమయాన్ని వెచ్చించడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు. దీంతో చిన్న ట్రిక్ ద్వారా అనవసర మెసేజ్ లు క్షణాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇందు కోసం ట్రిక్ పాటించాలి.

    ముందుగా జీమెయిల్ ను ఓపెన్ చేయాలి. జీమెయిల్ డిస్ ప్లే ఉన్న చోట Rightside అప్పర్ లో Setting అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో See All settings పై క్లిక్ చేయాలి. దీంతో మరో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పడు Left ఉన్న బాక్స్ లో లేబుల్ అనే బాక్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కేటగిరీస్ వైజ్ ఆప్షన్లు వస్తాయి. వీటిలో అనవసరపు అనే కేటగిరీపై క్లిక్ చేయగా.. అందుకు సంబంధించిన మెసేజ్ లు వస్తాయి. దీంతో ఆల్ సెలెక్ట్ చేసి డెలిట్ చేసుకోవాలి. ఇలా ఒక్కో మెసేజ్ ను కాకుండా ఒకేసారి క్షణాల్లో చాలా మెసేజ్ లు డెలిట్ చేసుకోవచ్చు.

    ప్రస్తుతం జీమెయిల్ కు రోజూ వందల కొద్దీ మెసేజ్ లు వస్తుంటాయి. అయితే అన్నింటినీ ప్రతి రోజూ చూసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల ఇలాంటి మెసేజ్ లను సమయం వృథా కాకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే జీమెయిల్ మెసేజ్ డెలీట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఇంపార్టెంట్ మెసేజ్ లు కూడా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే మిస్సయి డెలిట్ అయితే నష్టపోతారు. అందువల్ల మెసేజ్ లు క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.