Instagram Features : స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది. సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. ఫలితంగా కొత్త కొత్త యాప్స్ తెరపైకి వస్తున్నాయి. ఇందులో కొన్ని విపరీతంగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో మెటా కంపెనీ రూపొందించిన ఇన్ స్టా అత్యంత ఆదరణ పొందింది. ఫేస్ బుక్ తర్వాత అధికంగా యూజర్లు వాడేది దీనినే. అయితే ఈ యాప్ వాడకం చాలా భిన్నంగా ఉంటుంది. యూజర్ల నుంచి ఆదరణ పెరిగిపోయిన నేపథ్యంలో ఇన్ స్టా లో మెటా కంపెనీ అనేక మార్పులు తెచ్చింది. కొత్త కొత్త ఫీచర్లను జోడించింది.
పోస్టుల షెడ్యూలింగ్
ఇన్ స్టా లో ఇది అత్యుత్తమమైన ఫీచర్. యూజర్లు ముందే తమ నిర్ణయానికి అనుగుణంగానే పోస్టులను పబ్లిష్ చేయవచ్చు. కంటెంట్, ఫోటోలు, క్యాప్షన్లు, ఫిల్టర్లను ఎంచుకొని.. వాటికి తగ్గట్టుగా పోస్టులకు షెడ్యూల్ నిర్ణయించి పబ్లిష్ చేసుకోవచ్చు.
క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ క్రియేషన్
మనం ఎంపిక చేసుకున్న స్టోరీస్ కొంతమందికి మాత్రమే వెళ్లాలంటే.. ముందుగా క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ను ఎంచుకోవాలి. దానికి తగ్గట్టుగా లిస్ట్ రూపొందించుకోవాలి. వారికి మాత్రమే స్టోరీస్ పంపించుకోవచ్చు.
దీని ద్వారా మరింత సులభతరం
ఇన్ స్టా లో మరో సూపర్ ఫీచర్ “క్విక్ షేర్ మెనూ”.. దీని ద్వారా యూజర్లు తమ ఫోటోలు, వీడియోలు, రీల్స్, తమకు నచ్చిన కాంటాక్ట్ లతో నేరుగా షేర్ చేసుకోవచ్చు. దీనివల్ల కంటెంట్ షేరింగ్ మరింత ఈజీ అవుతుంది.
నోట్ ను పోస్ట్ చేయొచ్చు
ఇన్ స్టా నోట్ సెక్షన్ అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా వీడియో లేదా ఆడియో రికార్డ్ చేసి నోట్ రూపంలో పోస్ట్ చేయొచ్చు. నోట్స్ సెక్షన్ అనేది డీఎం విభాగంలో అన్నిటికంటే పైన డిస్ ప్లే అవుతుంది. నోట్స్ కు లొకేషన్ కూడా ట్యాగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ లోకేషన్ కూడా నోట్స్ పై భాగంలో టెక్స్ట్ మీద కనిపిస్తుంది. దీనిని క్రియేట్ చేయాలంటే ఇన్ స్టా లోకి వెళ్లి డీఎం ట్యాబ్ లోకి వెళ్లాలి. యువర్ నోట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ నోట్స్ రాసి.. పోస్ట్ చేస్తే 24 గంటల వరకు అది లైవ్ లో కనిపిస్తుంది.
కష్టమైజ్ చేసుకోవచ్చు
ఇన్ స్టా ను మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. చాట్ థీమ్ లో తెలుపు లేదా ఇతర రంగుల బ్యాక్ గ్రౌండ్, గ్రేడియంట్ కలర్స్ ను ఎంచుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఇవి మీ మూడ్ ను ఆవిష్కరిస్తాయి.
రహస్య ఫోల్డర్
ఇది ఇన్ స్టా లో చూడకూడని లేదా ప్రమాదకరమైన సందేశాలను వడపోస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తే దారుణమైన లేదా తప్పుడు కంటెంట్ గురించి యూజర్లకు అవగాహన ఏర్పడుతుంది.
సేకరణ
యూజర్లకు అవసరమైన పోస్టులను సేవ్ చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనికోసం బుక్ మార్క్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దానిని నేరుగా మీ ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది.