Health Drinks : మీ పిల్లలకు హార్లిక్స్, బోర్నవీటా తాగిస్తున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..(వీడియో)

ఫంక్షన్ న్యూట్రిషనల్ డ్రింక్స్ ను FND అని పిలుస్తుంటారు. ఇవి ప్రోటీన్, ఇతర సూక్ష్మ ధాతువుల లోపాలను భర్తీ చేస్తాయి..FND పానీయాలను ఆల్కహాల్ లేనివని పిలుస్తుంటారు.

Written By: NARESH, Updated On : April 26, 2024 9:23 pm

Health Drinks

Follow us on

Health Drinks : చిన్నపిల్లల్లో శారీరక ఎదుగుదల కోసం చాలామంది తల్లిదండ్రులు ఉదయం తాగించే పాలల్లో హార్లిక్స్ లేదా బోర్నవీటా కలుపుతారు. దానివల్ల పిల్లలకు శక్తి లభిస్తుందని.. వారు బలవంతులవుతారని తల్లిదండ్రుల నమ్మకం. వాటి తయారీ కంపెనీలు చేసే ప్రచారం కూడా అలానే ఉంటుంది. గత దశాబ్దాల నుంచి ఈ తంతు ఇలానే సాగుతోంది. ఫలితంగా వీటిని తయారు చేసే హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వేలకోట్లకు ఎదిగిపోయింది. పైగా వీటికి హెల్త్ డ్రింకులు అనే పేరు పెట్టింది. అయితే మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఈ హెల్త్ డ్రింకుల తయారీలో ఆ కంపెనీ చక్కెర ను అధికంగా కలుపుతున్నట్టు తేలింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్త్ డ్రింక్ అనే పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

పిల్లలకు హార్లిక్స్, బోర్నవీటా తాగించడం సరికాదని ఓ వ్యక్తి కీలకమైన ప్రశ్న లేవనెత్తాడు. దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా రూపొందించాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో లక్షలాదిమంది వీక్షించారు. అనంతరం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఈ డ్రింక్స్ సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయా? అని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ విక్రయించే హార్లిక్స్, బూస్ట్ వంటి ఉత్పత్తులను హెల్త్ డ్రింక్స్ జాబితా నుంచి తొలగించింది. ఇక నుంచి వీటిని ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ పేరుతో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ విక్రయించనుంది. ఆ కంపెనీకి సంబంధించిన చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రితీష్ తివారీ ఈ విషయాన్ని విలేకరుల ఎదుట ప్రకటించారు. తాజాగా తాము తీసుకున్న ఈ నిర్ణయం ఉత్పత్తిని, కచ్చితంగా, పారదర్శకంగా అందించేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు.

ఆ వీడియో చర్చనీయాంశమైన తర్వాత మాల్ట్ ఆధారిత డ్రింక్స్ వల్ల కలిగే ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. హిందుస్థాన్ యూనిలీవర్ వంటి కంపెనీ చక్కర అధికంగా కలపడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది.. మరోవైపు చిన్న పిల్లల వైద్య నిపుణులు కూడా కేంద్ర వాదనలతో ఏకీభవించారు. హిందుస్థాన్ యూనిలీవర్ తయారు చేస్తున్న ఆ ఉత్పత్తుల్లో చక్కర పిల్లల ఆరోగ్యానికి సరికాదని నిరూపించారు.

ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్ అంటే ఏంటి..

ఫంక్షన్ న్యూట్రిషనల్ డ్రింక్స్ ను FND అని పిలుస్తుంటారు. ఇవి ప్రోటీన్, ఇతర సూక్ష్మ ధాతువుల లోపాలను భర్తీ చేస్తాయి..FND పానీయాలను ఆల్కహాల్ లేనివని పిలుస్తుంటారు. వీటిని మొక్క, జంతువు, సముద్ర లేదా సూక్ష్మజీవుల మూలాల నుంచి తయారుచేస్తారు. ఇది అదనపు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని డైటీషియన్లు చెబుతుంటారు.