Hydrogen – Fuel of the future: ఎక్కువగా వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ ఉపయోగిస్తారు. కొన్ని రకాల కార్లు.. పెద్దపెద్ద వాహనాలు నడవాలంటే డీజిల్ కచ్చితంగా కావాలి. అయితే ముడి చమురు అనేది పరిమితమైన వనరు. ఇప్పటికే ఈ వనరు మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. పైగా ప్రపంచవ్యాప్తంగా మూడు చమురు కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ముడి చమురు ఉన్న దేశాలపై అగ్రరాజ్యాలు గతంలో యుద్ధాలు కూడా చేశాయి. ముడి చమురు వల్ల దేశాల ఆర్థిక పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వనరుగా తెరపైకి వచ్చింది హైడ్రోజన్ ఇంధనం. వాస్తవానికి ముడి చమురును శుద్ధి చేయాలంటే అనేక ప్రక్రియలు చేపట్టాలి. దీనివల్ల వాతావరణ కాలుష్యమే కాదు నీటి, భూ కాలుష్యాలు కూడా ఏర్పడతాయి. అయితే ముడి చమురు వల్ల కర్బన ఉద్గారాలు అధికంగా ఏర్పడుతున్నాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం చోటు చేసుకుంటున్నది.
హైడ్రోజన్ ఇంధనం అత్యంత కీలకం
కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణం సర్వనాశనం అవుతున్నది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు కనుగొన్నది హైడ్రోజన్ ఇంధనం. ఇది ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నది. సూర్య రశ్మి, గాలి వంటి పునరుత్పాదక వలలు ఉపయోగించి నీటిని ఎలక్ట్రోలైసిస్ చేయడం ద్వారా హైడ్రోజన్ ను ఉత్పత్తి చేస్తారు. దీనిని మండించినప్పుడు కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటికి వస్తుంది. దీనివల్ల పర్యావరణానికి పెద్దగా హాని ఉండదు. దీనిని కేవలం విద్యుత్ తయారీకి మాత్రమే కాకుండా పెట్రోలియం, ఉక్కు, ఇతర పరిశ్రమలలో కూడా వాడవచ్చు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఉండదు. వనరులపై ఒత్తిడి పెరగదు. పైగా పునరుత్పాదక వనరుగా ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా ఆయాదేశాల ఆర్థిక ముఖచిత్రం కూడా మారుతుంది. అన్నిటికంటే విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఎందుకంటే భారత్ లాంటి అతిపెద్ద వినియోగదారులు ఉన్న దేశాలు కేవలం చమురు కోసమే భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
Also Read: Pranjali Awasthi Success Story: 16 ఏళ్ల వయసులోనే 100కోట్ల సంపాదన.. ఈ సక్సెస్ స్టోరీ మీకోసమే..
అదానీ గ్రూప్ మొదలుపెట్టింది
హైడ్రోజన్ ఇంధనానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని గౌతమ్ అదానీ ఈ రంగంలోకి ప్రవేశించారు. ఇటీవల ఆఫ్ గ్రిడ్ ఫై మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలెట్ ప్లాంట్ ను అదాని గ్రూప్ ప్రారంభించింది. దీనిని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. సూర్య రశ్మి, గాలి లాంటి వనరులను ఉపయోగించి హైడ్రోజన్ ను ఈ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తారు. మరోవైపు మనదేశంలో ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి. కేంద్రం ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది. అందువల్లే ఈ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు అదానీ గ్రూప్ వర్గాలు ఇటీవల వెల్లడించాయి.