Pranjali Awasthi Success Story: నేటి కాలంలో చాలామంది బట్టి చదువులు చదువుతూ ర్యాంకులు కొల్లగొడుతున్నారు. అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొంతమంది ఉద్యోగుల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. అందుకు కారణం వారికి సొంత స్కీల్ లేకపోవడమే. అయితే సొంత స్కీం అనేది ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది తల్లిదండ్రుల ద్వారా లేదా గురువుల ద్వారా నేర్చుకోవాలి. కానీ చాలామంది నేటి యువత ఈజీగా మనీ సంపాదించేందుకు తప్పుడు దారులు పడుతున్నారు. మరికొందరు మొబైల్లో వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఓ అమ్మాయి మాత్రం చిన్నప్పటి నుంచే తండ్రి సహాయంతో కంప్యూటర్ నేర్చుకొని.. ఆ తర్వాత ఇప్పుడు 100 కోట్లకు అధిపతిగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి వయసు ఎంతో తెలుసా? కేవలం 16 ఏళ్లు మాత్రమే. అయితే ఈ అమ్మాయి ఈ వయసులో 100 కోట్లు సాధించడానికి ఏం చేసిందో తెలుసుకోవాలని ఉందా? ఈ ఆసక్తి స్టోరీ మీకోసమే..
సాధారణంగా ఏడేళ్ల వయసులో ఉన్న అమ్మాయిలు ఉదయం స్కూలుకు వెళ్లి వచ్చి సాయంత్రం స్నేహితులతో గడుపుతూ ఉంటారు. అలాకాకుండా టీవీ లేదా మొబైల్ తో కాలక్షేపం చేస్తారు. కానీ Pranjali Awasthi అని అమ్మాయి స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత తండ్రి చేసే జాబ్ చూస్తూ ఉండేది. అలా చిన్నప్పుడే కంప్యూటర్ను నేర్చుకున్నది. ఈ సమయంలో కంప్యూటర్ పై ఆసక్తి పెరిగిన ప్రజలి కి కోడింగ్ చేయడం తెలిసింది. ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి కోడింగ్ పూర్తిగా నేర్చుకున్నది. ఇలా కొన్నాళ్లపాటు తండ్రితో సహా కోడింగ్ చేస్తూ వచ్చింది.
Also Read: Atrocious Incidents: నయా నేర కథలు : పెళ్లి చేసుకొని చంపేబదులు ముందే చెప్పొచ్చు కదా..
ప్రజలీ అవస్థికి 13 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత Mission Learning అనే చిన్న స్టాటప్ ను స్టార్ట్ చేసింది. దీని ద్వారా కొన్ని ప్రాజెక్టులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఏదేని ప్రాజెక్టు ఎక్సైటింగ్ కావడానికి యాక్సెస్ అవుతూ ఉంటుంది. దీంతో చాలామందికి ఇది ఉపయోగకరంగా ఉండడంతో ఈ కంపెనీపై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వైపు వెళ్లడంతో.. ప్రజలి అవస్తి 2022 సంవత్సరంలోనే Delv.Ai అని కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీకి ఆ సమయంలో మొత్తం 3.7 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు దీని పైనే దృష్టిపెట్టిన ఈమె దానిని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ 100 కోట్ల టర్నోవర్తో కలిగి ఉంది.
Also Read: Jeff Bezos Venice Wedding Protests: కుబేరుడి పెళ్లికి ఇంత కష్టమా? ఏంటా కథ?
చిన్నవయసులోనే కోట్ల రూపాయలు సంపాదించిన ఈమె నేటి తరానికి ఆదర్శం అని కొనియాడుతున్నారు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగంపై ఎంతో ఆసక్తి పెంచుకున్న ఆమె ముందు ముందు మరిన్ని ప్రాజెక్టులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది యువత కేవలం ర్యాంకుల కోసం మాత్రమే చదువుతున్నారు. సొంతంగా నేర్చుకోవడానికి దీనిపై ఆసక్తి చూపడం లేదు. ఇలా ప్రత్యేకంగా ఏదైనా ఒకదానిపై ఆసక్తి చూపితే జీవితంలో ఏదైనా విజయం సాధించడానికి అనుకూలంగా మారుతుందని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు.