https://oktelugu.com/

Robot : రోబోల దూకుడు ఇలానే ఉంటే భవిష్యత్తు కాలంలో మనుషులు మిగలరు.. భూమి మొత్తం వాటి సొంతమే అవుతుంది..

మనిషి సుఖవంతమైన జీవితం కోసం యంత్రాలను వాడటం పరిపాటిగా మారింది. ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే రోబోలు. ఈ రోబోలపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. క్లిష్టమైన పనులలో రోబోలను వాడుతున్న ఉదంతాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోబోల వల్ల మనిషి మనుగడకు ప్రమాదం పొంచి ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 13, 2024 / 11:56 AM IST

    Robot

    Follow us on

    Robot : క్లిష్టమైన పనులలో రోబోలను వాడటం ప్రస్తుత కాలంలో పరిపాటిగా మారింది. రెస్టారెంట్లో ఫుడ్ డెలివరీ చేయడం మొదలుపెడితే అంతరిక్షంలో ప్రయోగాల వరకు రోబోల వినియోగం పెరిగింది. అయితే పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తు కాలంలో రోబోలు మనుషుల మీద దాడి చేస్తాయని.. ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుంటాయనే భయం వెంటాడుతోంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనిషి మీద రోబో దాడి చేసిన సంఘటన 1979లో జరిగింది. IFL science అందించిన నివేదిక ప్రకారం 45 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తిని రోబో చంపేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. రోబో దాడిలో చనిపోయిన వ్యక్తి పేరు రాబర్ట్ విలియం అని రికార్డుల్లో నమోదయింది. రాబర్ట్ వీడియో తనకు 25 ఏళ్ల వయసులో మిచి గాన్ లోని ఫ్లాట్ రాక్ లోని ఫోర్డ్ మోటార్ కంపెనీ కాస్టింగ్ ప్లాంట్ లో విధులు నిర్వహించేవాడు. ఆరోజు అతను ఫ్యాక్టరీలోని ఒక విభాగంలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో యంత్రం సరిగా పనిచేయడం లేదు. దీంతో ఏదో లోపం చోటుచేసుకుని ఉంటుందని అతడు భావించాడు. తప్పును తెలుసుకునేందుకు షెల్వింగ్ యూనిట్ మూడవ అంతస్తులోకి ప్రవేశించాడు. అప్పుడే ఒక యాంత్రికమైన హస్తం అతడిని వెనుకనుంచి గట్టిగా కొట్టింది. అలా 30 నిమిషాల పాటు కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన రోబోటిక్ వ్యవస్థ రాబర్ట్ ను ఒక నిర్జీవమైన వస్తువుగా పరిగణించింది. అతడిని స్టోరేజ్ యూనిట్ నుంచి తరలించింది. రాబర్ట్ కుటుంబం 1983లో ఈ ప్రమాదానికి కారణం రోబో తయారీదారు రిటన్ ఇండస్ట్రీ అని ఆరోపించింది. ఆ రోబోటిక్ వ్యవస్థను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుక్కోకపోవడం.. భద్రత పరికరాలను ఏర్పాటు చేయకపోవడంతో వారు తమకు పరిహారం ఇవ్వాలని కోర్టులో దావా వేశారు. వాదనలు విన్న కోర్టు రాబర్ట్ కుటుంబానికి 15 మిలియన్ల పరిహారాన్ని అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ కంపెనీ అలాగే చేసింది. ఇక జపాన్, దక్షిణ కొరియాలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

    జపాన్, దక్షిణ కొరియా దేశాలలో..

    1981లో జపాన్ లోని ఆకాసి కవాసకి హెవీ ఇండస్ట్రీస్ ప్లాంట్ లో 37 సంవత్సరాల కార్మికుడు కేంజి ఉరాడా మెకానికల్ అండ్ గట్టిగా తగలడంతో చనిపోయాడు. అతడు కూడా రోబో చేసిన నిర్వాకం వల్లే చనిపోయాడు. ఇక గత ఏడాది దక్షిణ కొరియాలోని చితకబాది చంపేసింది. ఆహార పెట్టెలకు, ఆ వ్యక్తికి మధ్య తేడా గుర్తించలేక రోబోటిక్ చెయ్యి ఆ వ్యక్తిని కూరగాయలపెట్టె అనుకుని పొరపాటున గట్టిగా పట్టుకుంది. అంతేకాదు అతని కన్వేయర్ బెల్ట్ పైకి తోసి వేసింది. దీంతో అతడు చనిపోయాడు. ఇదే విషయాన్ని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్ హాప్ వెల్లడించింది.

    సాంకేతిక నిపుణుల ఆందోళన

    అయితే ఈ పరిణామాల పట్ల సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు మనిషి జీవితానికి సవాల్ విసురుతాయని చెబుతున్నారు. “రోబో సినిమాలో చిట్టి అనే హ్యూమనాయిడ్ రోబోను వశీకర్ తయారు చేస్తాడు. ఆ తర్వాత ఆ రోబో వశీకర్ ను చంపడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సాంకేతిక ప్రపంచం లో జరుగుతున్న సంఘటనలు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తు కాలంలో ఈ భూమిని రోబోలే ఆక్రమిస్తాయని” సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.