https://oktelugu.com/

Rakul Preet Singh: నాలుగు రోజులు వాడుకుని తర్వాత తీసేశారు… ప్రభాస్, దిల్ రాజు పై రకుల్ ఫైర్!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ బిగినింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవల గుర్తు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభాస్, దిల్ రాజులను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ప్రభాస్, దిల్ రాజుతో రకుల్ వివాదం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : September 13, 2024 / 11:54 AM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు. 2009లో ఆమె కెరీర్ మొదలైంది. గిల్లీ అనే కన్నడ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆమె రెండో చిత్రం కెరటం. ఈ తెలుగు మూవీ 2011లో థియేటర్స్ లోకి వచ్చింది. రకుల్ కి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్రేక్ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సూపర్ హిట్ కొట్టింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలతో ఆమె స్టార్డం తెచ్చుకుంది.

    టాలీవుడ్ టాప్ స్టార్స్ తో రకుల్ ప్రీత్ నటించింది. అయితే ప్రభాస్ తో మూవీ చేయలేదు. కానీ తెలుగులో రకుల్ ఫస్ట్ మూవీ ప్రభాస్ తో చేయాల్సింది అట. నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశాక ఆమెను తీసేసి మరొక హీరోయిన్ ని తీసుకున్నారట. తన ఫస్ట్ షెడ్యూల్ ముగియడంతో మరో మూవీ షూటింగ్ కోసం రకుల్ ఢిల్లీ వెళ్లిందట. కనీసం తనకు చెప్పకుండా తన స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారట.

    ఆమె మాట్లాడుతూ… ప్రభాస్ పక్కన ఛాన్స్ రావడంతో నేను ఎంతో సంతోషించాను. నాకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశపడ్డాను. కానీ నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశాక నన్ను తీసేశారు. నా స్థానంలో మరొకరిని తీసుకున్నారు. నేను చాలా బాధపడ్డాను, అని రకుల్ వాపోయింది. ప్రభాస్ తో రకుల్ చేయాల్సిన ఆ చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. రకుల్ హీరోయిన్ గా ఎంపిక కాగా నిర్మాత దిల్ రాజు, ఆమెను తొలగించి కాజల్ అగర్వాల్ ని తీసుకున్నాడట.

    మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుండి రకుల్ ప్రీత్ ని తొలగించడం పై దిల్ రాజు ఓ సందర్భంలో వివరణ ఇచ్చాడు. ప్రభాస్-రకుల్ కాంబినేషన్ సీన్స్ షూట్ చేశాక నేను రషెస్ చూశాను. ప్రభాస్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ బక్క పలచగా కనిపించింది. దాంతో నేను నిరాశ చెందాను. రకుల్ స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కాజల్ అయితే బాగుంటుందనిపించింది.

    అదే విషయం ప్రభాస్ కి చెప్పాను. ఆల్రెడీ నేను డార్లింగ్ మూవీ కాజల్ తో చేస్తున్నానని ప్రభాస్ అన్నాడు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. మిస్టర్ పర్ఫెక్ట్ హీరోయిన్ సెంట్రిక్ గా కథ నడుస్తుంది. కాబట్టి కాజల్ అయితేనే బెటర్ అన్నాను. ప్రభాస్ కూడా ఒప్పుకున్నాడు. రకుల్ ని తీసేసినందుకు నాకు బాధేసింది. కానీ నాకు సినిమా ముఖ్యం. వ్యక్తుల కంటే నేను సినిమాకు ప్రాధాన్యం ఇస్తాను, అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు…