https://oktelugu.com/

వాట్సాప్ లో ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా.. ఏం చేయాలంటే..?

దేశంలోని ప్రజలలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్ ఏదైనా ఉందా అంటే ఆ యాప్ వాట్సాప్ అని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన నచ్చకపోయినా, అవతలి వ్యక్తులకు మనపై కోపం వచ్చినా వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేస్తుంటారు. అయితే అవతలి వ్యక్తి బ్లాక్ చేశారనే సంగతి మనకు సులభంగా తెలియదు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఇతరులు మనల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు. వాట్సాప్ గోప్యత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఇతరులు మనల్ని బ్లాక్ చేశారనే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 6, 2021 8:22 pm
    Follow us on

    దేశంలోని ప్రజలలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్ ఏదైనా ఉందా అంటే ఆ యాప్ వాట్సాప్ అని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన నచ్చకపోయినా, అవతలి వ్యక్తులకు మనపై కోపం వచ్చినా వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేస్తుంటారు. అయితే అవతలి వ్యక్తి బ్లాక్ చేశారనే సంగతి మనకు సులభంగా తెలియదు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఇతరులు మనల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.

    వాట్సాప్ గోప్యత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఇతరులు మనల్ని బ్లాక్ చేశారనే సంగతి చెప్పదనే విషయం తెలిసిందే. ఎవరైనా బ్లాక్ చేశారనే అనుమానం ఉంటే అవతలి వ్యక్తుల ఆన్ లైన్ స్టేటస్ ను చూడటం సాధ్యం కాదు. లాస్ట్ సీన్, స్టేటస్ లను కూడా అవతలి వ్యక్తి బ్లాక్ చేస్తే మనం చూడలేము. అయితే లాస్ట్ సీన్ ను డిసబుల్ చేస్తే కూడా లాస్ట్ సీన్ కనబడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

    కాంటాక్ట్ లిస్ట్ నుంచి బ్లాక్ చేస్తే అవతలి వ్యక్తుల ప్రొఫైల్ ఫోటో కనిపించదు. అయితే ప్రొఫైల్ ఫోటో పెట్టకపోయినా అవతలి వ్యక్తి చూసే అవకాశం ఉండదనే సంగతి తెలిసిందే. వాట్సాప్ మెసేజ్ డెలివరీ కాకపోయినా ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కనెక్ట్ కాకపోయినా అవతలి వ్యక్తి వాట్సాప్ ను బ్లాక్ చేశారని గుర్తుంచుకోవాలి. నెట్వర్క్ సరిగ్గా ఉండి కాల్స్ కలవకపోతే మాత్రం అనుమానించాల్సిందేనని చెప్పవచ్చు.

    వాట్సాప్ నంబర్ ను ఎవరు బ్లాక్ చేశారని భావిస్తారో వారి నంబర్ తో గ్రూప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం ద్వారా సులభంగా అవతలి వ్యక్తి బ్లాక్ చేశారో లేదో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.