https://oktelugu.com/

రికార్డు ‘దాత’: ఒకటి కాదు.. రెండు కాదు..29 సార్లు

ఈ ప్రపంచంలో అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు. ఎందుకంటే అది ఒక మనిషిని కాపాడుతుంది. వారి ప్రాణాలు నిలబెట్టిన సంతోషం మనకు కలుగుతుంది. అందుకే ఎంతో మంది రక్తదాతలను దేవతలుగా కొలుస్తారు. ఇలా ఒకసారి రెండు సార్లు ఇచ్చిన వారున్నారు. పోనీ 10 సార్లు ఇచ్చిన వారున్నారు. కానీ ఈయన ఏకంగా 29 సార్లు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఆయన సేవా నిరతిపై ఓ లుక్ వేద్దాం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అజయ్ కుమార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2021 / 08:01 PM IST
    Follow us on

    ఈ ప్రపంచంలో అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు. ఎందుకంటే అది ఒక మనిషిని కాపాడుతుంది. వారి ప్రాణాలు నిలబెట్టిన సంతోషం మనకు కలుగుతుంది. అందుకే ఎంతో మంది రక్తదాతలను దేవతలుగా కొలుస్తారు. ఇలా ఒకసారి రెండు సార్లు ఇచ్చిన వారున్నారు. పోనీ 10 సార్లు ఇచ్చిన వారున్నారు. కానీ ఈయన ఏకంగా 29 సార్లు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఆయన సేవా నిరతిపై ఓ లుక్ వేద్దాం..

    నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అజయ్ కుమార్ పాఠక్. వయసు 49 సంవత్సరాలు.. నడి వయసు వచ్చినా కూడా ఆయన ఆలోచనలు గొప్పగా ఉంటాయి. తన జీవితంలో జరిగిన ఓ చేదు ఘటన ఎవ్వరి జీవితంలోనూ జరగకూడదని సంకల్పించిన అజయ్ రక్తదాన్ని మహాదానంగా భావించి అడిగిన వారందరికి ఉచితంగా రక్తదానం చేస్తూ గొప్ప రక్తదాతగా నిలుస్తున్నాడు.

    ఒక సారి రక్తదానం చేయడానికే కుర్రోమొర్రో అని మనం భయపడుతుంటాం. ఇచ్చినా ఏదో బలవంతం మీద రక్తదానంచేస్తాం.. కానీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు అజయ్ కుమార్. ఈయన కృపా గ్యాస్ ఏజెన్సీలో 12 సంవత్సరాలుగా మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

    అజయ్ కుమార్ ఇంతలా రక్తదానం చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. అజయ్ తండ్రి మనోహర్ పాఠక్ 1996లో అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడు రక్తం అవసరం పడింది. అప్పుడు అజయ్ ది బీ+, వాళ్ల నాన్నది కూడా అదే రక్తగ్రూపు. అయితే నాన్న అనారోగ్యం బారినపడ్డప్పుడు స్థానికంగా అజయ్ లేడు. ఆ సమయంలో నాన్న కు నాలుగు యూనిట్ల రక్తం అవసరం పడింది. ఆ సమయంలో మనోహర్ స్నేహితుడు, సోదరుడు కలిసి రక్తదానం చేశారు. మిగిలిన రెండు యూనిట్ల కోసం తీవ్రంగా గాలించారు. ఎక్కడ రక్త దొరకలేదు. ఎవరూ ముందుకు రాలేదు.

    చివరకు హైదరాబాద్ లో అష్టకష్టాలు పడి రెండు యూనిట్ల రక్తం కొని తీసుకొచ్చారు. ఆ సమయంలో పడ్డ కష్టాలు చూసి చలించిన అజయ్ కు రక్తదానం చేయాలని సిద్ధించింది. అప్పటి నుంచి ఎవరు రక్తం కావాలని ఫోన్ చేసినా వెంటనే అజయ్ వాలిపోయి వారికి ఉచితంగా రక్తదానం చేస్తున్నాడు. ఇలా 1996 నుంచి 2021 వరకు ఇప్పటివరకు 29 సార్లు రక్తదానం చేశాడు. ఇందులో మూడు సార్లు మాత్రమే క్యాంపులలో రక్తదానం చేశాడు. ఒకసారి పోలీస్ అమరవీరుల దినోత్సవంలో.. మరోసారి శనిషింగపూర్ లో క్యాంపులో చేశాడు.

    మిగిలిన 26 సార్లు ఎవ్వరూ ఆపదలో ఉన్నామని.. రక్తదానం చేయాలని కోరినా వెళ్లి చేసేవాడు. కృపా గ్యాస్ ఏజెన్సీలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ ఇప్పటికీ కూడా రక్తదానం చేస్తూ గొప్ప దాతగా నిలిచాడు. ఈయన సేవానిరతికి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో అరుదు అని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.