https://oktelugu.com/

ఇసుక ధర తగ్గింపు.. ‘క్రెడాయి’ సమావేశంలో నిర్ణయం

ఏపీలో జగన్ సర్కార్ వచ్చాక ఇసుక విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఉన్న ఇసుక రీచులను రద్దు చేసి సామాన్యులకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా సమూల మార్పులు చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.జి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో “ఇసుకపై బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ క్రెడాయి సభ్యులకు.. ఇసుక సరఫరాదారులైన జయప్రకాష్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతినిధులు మధ్య ఒక ముఖ్యమైన సమావేశాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2021 / 09:36 PM IST
    Follow us on

    ఏపీలో జగన్ సర్కార్ వచ్చాక ఇసుక విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఉన్న ఇసుక రీచులను రద్దు చేసి సామాన్యులకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా సమూల మార్పులు చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.జి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో “ఇసుకపై బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ క్రెడాయి సభ్యులకు.. ఇసుక సరఫరాదారులైన జయప్రకాష్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతినిధులు మధ్య ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా రాష్ట్ర క్రెడాయి ప్రధాన కార్యదర్శి కె.సుభాష్ చంద్రబోస్, వైస్-ప్రెసిడెంట్ వై.వి.రమణారావు, కోశాధికారి డి.రాంబాబు మరియు ఇతర క్రెడాయి ప్రతినిధులు పాల్గొని ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన ఇసుక రీచ్ లన్నింటిని ప్రారంభించి వాటిని కార్యాచరణ లో ఉంచితే బిల్డర్లు, మరియు సామాన్య ప్రజానీకం తమకు అందుబాటులో ఉన్న రీచ్ ల నుండి ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చు. అందువల్ల రవాణా భారం తగ్గుతుంది.అంతే కాకుండా ఇసుక రీచుల వద్ద లారీ లోడ్ చేయటానికి కనీసం 2, 3 రోజులు పడుతోందని దాని వల్ల బిల్డర్లకు అదనపు భారమోతోందని సమావేశంలో చర్చించారు.

    ఇసుక ఇప్పుడు ఉన్న ధర 475 రూపాయలు కాకుండా 375 రూపాయలకు తగ్గించాలని సమావేశంలో నిర్ణయించారు. బిల్డర్లకు, ప్రజలకు నాణ్యమైన ఇసుకను నిరంతరాయంగా సరఫరా చేయాలని, అలాగే జిఎస్.టి బిల్లులు ఇవ్వాలని మరియు ఆన్లైన్ ప్రెమెంట్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరీ ముఖ్యంగా జయప్రకాష్ కంపెనీ వారు ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువగా అమ్మకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించి పై సమస్యలన్నింటిని తగురీతిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

    ఈ సమావేశంలో క్రెడాయి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.సి.బోస్, జి.ఎస్.ఆర్.మోహన రావు, కె.రాజేంద్ర, వి భీమశంకర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.