AI Data Centers: సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సుఖవంతం చేసింది. టెక్నాలజీలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కొత్త కొత్త పరిజ్ఞానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిజ్ఞానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు వరుసలో ఉంటుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో, అనితర సాధ్యమైన అద్భుతాలను కళ్ళ ముందు ఉంచడంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రస్తుతం టెక్నాలజీ సమూలంగా మారిపోయింది.. అనేక క్లిష్టతరమైన వ్యవహారాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడుస్తున్నాయి. ఇందులో చాలావరకు విజయవంతమవుతున్నాయి కూడా.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కృత్రిమమైన మేధ. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్, ఇతర వ్యవహారాలు మనుషులు మాత్రమే చూసుకుంటారు. కాకపోతే ఈ పరిజ్ఞానం పనిచేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. అత్యంత వేగవంతంగా కూడా ఉంటుంది. అందువల్లే దీనిని కృత్రిమ మేధ అని పిలుస్తుంటారు. ఆర్టిఫిషర్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు తెలియని సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.. అది కూడా అత్యంత ఖచ్చితత్వంతో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా సర్వర్ల మీద ఆధారపడి పని చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే చాట్ బాట్ ను ఏదైనా ప్రశ్న మనం అడిగితే.. దానికి అనుసంధానమైన సర్వర్లు వెంటనే వేడెక్కిపోతాయి.. వాస్తవానికి ఈ విషయం చాలామందికి తెలియదు. సర్వర్లు వేగవంతంగా పనిచేసే క్రమంలో వేడెక్కుతాయి. అలా వేడెక్కిన సర్వర్లను చల్ల పరచడానికి నీటిని వాడుతారు. ఇలా వేడిగా మారిన సర్వర్లను చల్లగా మార్చడానికి బిలియన్ల లీటర్ల నీటిని ఉపయోగిస్తారు.
ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారు 765 లీటర్ల నీటిని ఉపయోగించారు. ఇది గ్లోబల్ బాటిల్ వాటర్ ఇండస్ట్రీ మొత్తం వినియోగించే నీటితో సమానం… ఈ స్థాయిలో నీటిని ఉపయోగించారంటే ఆ సర్వర్లు ఎంతలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మనం వాడే సాంకేతికత వెనుక ఇంతటి నీటి దాహం దాగి ఉంది. భవిష్యత్ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మరింత పెరుగుతుంది.. ఆ సమయంలో సర్వర్లు ఇంకా వేడెక్కుతాయి. అలాంటప్పుడు వాటిని కూల్ చేసేందుకు ఇంకా ఎక్కువ నీటిని వాడాల్సి ఉంటుంది. ఈ ప్రకారం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్లను కూల్ చేయడానికి సప్త సముద్రాల నీరు కూడా సరిపోదేమోనని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.