Star Hero: స్టార్ హీరో అవ్వాలంటే మాస్ సినిమాలు చేయాల్సిందే అనే ఒక నమ్మకంతో మన హీరోలు ముందుకు సాగుతున్నారు. అందుకే ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలు సైతం మొదటి సినిమాతోనే మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం చేసి అక్కినేని అఖిల్ బొక్క బోర్లా పడ్డాడు. ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు సరజ్ఞ సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు. కారణమేంటంటే మొదటి సినిమా అయిన అఖిల్ సినిమాతోనే భారీ కంటెంట్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు. ఆ తర్వాత హలో అంటూ లవ్ స్టోరీ తో వచ్చినా కూడా అది ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దాని మీద సరైన క్లారిటీ లేకుండా పోయింది. తనకు ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలపాటు సక్సెస్ లేకపోయిన ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. మరొకరైతే ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయిపోయేవారు. అఖిల్ విషయాన్ని పక్కన పెడితే విజయ్ దేవరకొండ సైతం కెరియర్ మొదట్లో లవ్ స్టోరీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు మాస్ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.కింగ్ డమ్ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి అది ఆశించినా మేరకు విజయాన్ని సాధించలేదు… అందులో విజయ్ లుక్స్ అద్భుతంగా ఉన్నప్పటికి సినిమా సక్సెస్ కాకపోవడంతో అతను తీవ్ర విమర్శలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
అందుకే ఇప్పుడు ‘రౌడీ జనార్ధన్’ అంటు మరోసారి మాస్ జపం చేస్తున్నాడు. ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే ఆయన టైర్ వన్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం మరోసారి అయిన వెనుకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… నిజానికి ఇప్పుడున్న స్టార్ హీరోలందరు మాస్ సినిమాలు చేసిన తర్వాతనే స్టార్ హీరోలుగా మారారు.
కానీ కెరియర్ లో ఒక స్టేజ్ వచ్చేంతవరకు వాళ్లకి ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయో ఆ సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఒక ఐడెంటిటి సంపాదించుకున్న తర్వాత అప్పుడు మాస్ హీరోగా మారే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాస్ సినిమాలు అందరికి సెట్ అవ్వవు.
ఆ కథలు కొందరికి మాత్రమే సరిపోతాయి. వాటిని సక్సెస్ ఫుల్ గా డెలివరీ చేయడం అనేది అంత ఆషా మాషి వ్యవహారమైతే కాదు. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్క హీరో ముందుకు సాగితే మంచిదని కొందరు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం.