Threads : ఆరంభ శూరత్వం అంటే ఇదే కాబోలు. ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్ ను తీసుకొచ్చిన ఫేస్ బుక్ మార్క్ జుకర్ బర్గ్ అడ్డంగా ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. థ్రెడ్ ను ప్రారంభించిన కొద్ది రోజులకే యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఆక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గిపోతుండడం మార్క్ జుకర్ బర్గ్ ను ఆలోచనలో పడేస్తోంది. దీనికి సంబంధించి కూడా పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఇదే విషయాలు వెల్లడి కావడంతో జూకర్ బర్గ్ తల పట్టుకుంటున్నట్టు సమాచారం.
మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజువారీ యూసర్లు 10 మిలియన్లు ఉన్నట్టు ప్రకటించారు. కానీ ఇటీవల దానికి సంబంధించి విడుదలైన నివేదిక మాత్రం భిన్నమైన ఫలితాలను ప్రకటించింది. వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన ప్రధాన ప్రకారం ఈ యాప్ లో రోజువారి ఆక్టివ్ విద్యుల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అది కేవలం 10 మిలియన్ల వరకే ఆగిపోయింది. జూలై నెల ప్రారంభంలో గరిష్ట స్థాయి నుంచి 70% యూజర్ల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఈ పరిణామం మార్క్ జూకర్ బర్గ్ కు మింగుడు పడటం లేదు. ఎన్నో అంచనాలతో ప్రవేశపెట్టిన థ్రెడ్స్ తన అంచనాలను తలకిందులు చేయడం పట్ల బర్గ్ ఒకింత నిర్వేదంతో ఉన్నట్టు అమెరికన్ మీడియా చెబుతోంది.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం థ్రెడ్స్ తో పోల్చి చూసినప్పుడు ట్విట్టర్ రోజువారి యాక్టివ్ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. ఒకవేళ ట్విట్టర్ కు గట్టి పోటీ ఇవ్వాలి అంటే థ్రెడ్స్ కు భారీ ఎత్తున యూజర్లు కావాలి.. దీనికి తోడు సైన్ అప్ ల విషయంలో జూకర్ బర్గ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. యూజర్లు సైన్ ఇన్ కంటే సైన్ అప్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో అది అంతిమంగా యాప్ వృద్ధి మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జూన్ 5న థ్రెడ్స్ అందుబాటులోకి వచ్చింది. కొత్త ఒక చింత అన్నట్టుగా యూజర్లు సైన్ అప్ అయ్యేందుకు పోటీపడేవారు. అయితే రాను రాను వారి సంఖ్య పడిపోతుంది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ట్విట్టర్ కు తామే ప్రధాన పోటీదారు అని థ్రెడ్స్ సంస్థ చెబుతోంది. యాప్ కొత్త అనుభూతి ఇచ్చేలాగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మెటా యాజమాన్యం ప్రకటించింది. అయినప్పటికీ, వినియోగదారులు తగ్గిపోకుండా ట్విట్టర్ ఎలాంటి ఫీచర్లను అందిస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లు ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మెటా యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.