Google Maps Hyderabad: హైదరాబాద్ లో ఇక ఎక్కడికైనా వెళ్లడం ఈజీ.. అందరికీ ఎంతో ఉపయోగం ఇదీ

Google Maps Hyderabad: టెక్నాలజీ పెరిగే కొద్దీ సౌకర్యాలన్నీ మన కాళ్లముందుకే వస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలో అడ్రస్ కనుక్కొని అక్కడం చేరడం అంటే తలకుమించిన భారమే. ఏదైనా ఒక అడ్రస్ కు డోర్ డెలివరీ చేయడం ఎంతో కష్టం. కానీ టెక్నాలజీ పుణ్యమా? అని ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలియని వారు కూడా ఈజీగా వెళ్లిపోతున్నారు. తాము అనుకున్న గమ్యస్థానానికి చేరుతున్నారు. హైదరాబాద్ సందుబొందుల్లో సరిగ్గా ఫలానా చోటుకు వెళ్లడం ఒకప్పుడు ఎంతో కష్టమయ్యేది. కానీ […]

Written By: NARESH, Updated On : July 28, 2022 1:56 pm
Follow us on

Google Maps Hyderabad: టెక్నాలజీ పెరిగే కొద్దీ సౌకర్యాలన్నీ మన కాళ్లముందుకే వస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలో అడ్రస్ కనుక్కొని అక్కడం చేరడం అంటే తలకుమించిన భారమే. ఏదైనా ఒక అడ్రస్ కు డోర్ డెలివరీ చేయడం ఎంతో కష్టం. కానీ టెక్నాలజీ పుణ్యమా? అని ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలియని వారు కూడా ఈజీగా వెళ్లిపోతున్నారు. తాము అనుకున్న గమ్యస్థానానికి చేరుతున్నారు.

హైదరాబాద్ సందుబొందుల్లో సరిగ్గా ఫలానా చోటుకు వెళ్లడం ఒకప్పుడు ఎంతో కష్టమయ్యేది. కానీ గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీతో ఇప్పుడు కారులో, బైక్ లో అది పెట్టుకొని రయ్యి రయ్యమని అక్కడికి చేరిపోతున్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇప్పుడు అడ్రస్ దొరకబట్టడం సులువుగా మారిపోయింది. చిరునామాను ఈజీగా చేరుకోగలుగుతున్నాం.

ఇదంతా గూగుల్ తీసుకొచ్చిన ‘జీపీఎస్’ మహిమనే. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని గమ్యస్తానానికి ఈజీగా వెళ్లిపోవచ్చు. ఇక ఈ మ్యాప్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. సరికొత్త ఫీచర్లతో ప్రజలకు మరింతగా సేవలందించేందుకు గూగుల్ రెడీ అయ్యింది.

తాజాగా గూగుల్ తీసుకొచ్చింది ‘స్ట్రీట్ వ్యూ’ ఆప్షన్. గూగుల్ మ్యాప్స్ లో ఇక నుంచి ‘గల్లీలను మనం చూడొచ్చు’. ఈ స్ట్రీట్ వ్యూ ఫీచర్ సహాయంతో ఏ ప్రాంతాన్నయినా రియలిస్టిక్ గా చూడొచ్చు. ఇప్పటివరకూ ఈ ఫీచర్ కేవలం విదేశాల్లోనే మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ తాజాగా గూగుల్ ఈ ఫీచర్ ను భారత్ లోనూ పరిచయడం విశేషం.

హైదరాబాద్ సహా భారత్ లోని 8 నగరాల్లో గూగుల్ ఈ స్ట్రీట్ వ్యూ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో ఏ ప్రాంతాన్ని అయినా ఉన్నది ఉన్నట్టుగా సహజంగా చూడొచ్చు. మీ లోకేషన్ కు సమీపంలో ఉన్న ల్యాండ్ మార్క్ లను సులభంగా గుర్తించి చేరుకోవచ్చు.

గూగుల్ ఈ సేవలను తొలుత దేశంలోని బెంగళూరులో జులై 27న లాంచ్ చేసింది. బెంగళూరు తర్వాత ఈ ఫీచర్ ను హైదరాబాద్ లోనే ప్రారంభించింది. వీటితోపాటు చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబై, పుణే, నాసిక్, వడోదర, అహ్మద్ నగర్, అమృత్ సర్ నగరాల్లోనూ ఈసేవలను తీసుకొస్తోంది.

ఈ సరికొత్త ఫీచర్ కోసం గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్లి యాప్ లో లోకేషన్ టైప్ చేసి సెర్చ్ చేయాలి. స్క్రీన్ పై కింద ‘స్ట్రీట్ వ్యూ’ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే ఆ ప్రాంతం మొత్తం మన కళ్లముందు కనిపిస్తుంది. అలా మనం వెళ్లాలనుకునే ప్రాంతంను లైవ్ లో చూడొచ్చు. గమ్యానికి ఈజీగా చేరుకోవచ్చు.