Google: గూగుల్ సంచలన నిర్ణయం.. ఆ సేవలు నిలుపుదల

గత ఏడాది నుంచి గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లో పాడ్ కాస్ట్, ఇతర ఫీచర్లను జోడించడం మొదలుపెట్టింది. దాదాపు ఈ పని పూర్తయినట్టు గూగుల్ ప్రకటించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 28, 2024 3:11 pm

Google

Follow us on

Google: సాంకేతిక దిగ్గజం గూగుల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తన పాడ్ కాస్ట్ యాప్ సేవలకు స్వస్తి పలకనుంది. జూన్ 23 నుంచి ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవని గూగుల్ ప్రకటించింది.. జూన్ 23 నుంచి పాడ్ కాస్ట్ కు సబ్ స్క్రిప్షన్ కలిగి ఉన్న యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్ వైపు మళ్ళాల్సి ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ ఇప్పటికే యూజర్లకు ఈ మెయిల్స్ ద్వారా సందేశాలు పంపింది.

గత ఏడాది నుంచి గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లో పాడ్ కాస్ట్, ఇతర ఫీచర్లను జోడించడం మొదలుపెట్టింది. దాదాపు ఈ పని పూర్తయినట్టు గూగుల్ ప్రకటించింది. అతి త్వరలో వినియోగదారులు సంగీతం, పాడ్ కాస్ట్ లను యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో యూజర్లకు ఈ అవకాశం ఉంది. త్వరలో దీనిని ఇతర మార్కెట్లకు కూడా విస్తరిస్తామని గూగుల్ చెబుతోంది.. పాడ్ కాస్ట్ యాప్, ప్లే స్టోర్, ఐ స్టోర్ లో అందుబాటులో ఉంచామని గూగుల్ చెబుతోంది.

జూన్ 23 తర్వాత ఈ కంటెంట్ యూజర్లు ఉపయోగించలేరని గూగుల్ చెబుతోంది. గూగుల్ పాడ్ కాస్ట్ యాప్ ప్లే స్టోర్ లో దాదాపు 500 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ లను కలిగి ఉంది. ఎడిసన్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం పాడ్ కాస్ట్ లను ఉపయోగించేందుకు 23 శాతం మంది యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ను ఇష్టపడుతున్నారట. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే గూగుల్ పాడ్ కాస్ట్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారట. యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్ యాప్ వైపు మరలి వెళుతున్న నేపథ్యంలో.. సంగీతానికి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని ఒకే వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.. యూజర్లు మరింత అనుభూతి చెందేలా యూట్యూబ్ మ్యూజిక్ యాప్ కు మరిన్ని పాడ్ కాస్ట్ ఫీచర్లను జత చేస్తోంది. ఇందులో ఆర్ఎస్ఎస్ ఫీడ్ కూడా ఒకటి.. అంతేకాదు యూజర్లు వారి opml ఫైల్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఒక ఏడాది పాటు యూజర్ల సమాచారం మొత్తం గూగుల్ టేక్ అవుట్ లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.. సేమ్ గూగుల్ మాదిరిగానే యూట్యూబ్ మ్యూజిక్ లోను యూజర్లు బ్యాక్ గ్రౌండ్ ప్లే, డౌన్ లోడ్ పాడ్ కాస్ట్ లను వినే అవకాశాన్ని కల్పించింది. వాస్తవానికి గూగుల్ పాడ్ కాస్ట్ ను ఏప్రిల్ లోనే క్లోజ్ చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకుంది.