TGSRTC: టీజీఎస్‌ ఆర్టీసీ కళాశాలల్లో ప్రవేశాలు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంస్థ!

స్వయం ఉపాధిలో స్థిరపడాలనుకునే వారికి పదో తరగతి కాగానే ఐటీఐ కర్సులు వరం లాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతోపాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేసింది.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 2:57 pm

TGSRTC

Follow us on

TGSRTC: తెలంగాణలోని ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్నవారు జూన్‌ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌ (https://iti.telangana.gov.in )లో దరఖాస్తు చేసుకోవాలి. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, పెయింటర్‌ ట్రేడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి.

స్వయం ఉపాధికి..
స్వయం ఉపాధిలో స్థిరపడాలనుకునే వారికి పదో తరగతి కాగానే ఐటీఐ కర్సులు వరం లాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతోపాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతోపాటు అపార అనుభవం ఉన్న ఆర్టీసీ అధికారులతో తరగతులు నిర్వహిస్తోంది.

సంస్థలోనే అప్రంటిస్‌షిప్‌..
సంస్థ కళాశాలల్లో ప్రవేశం పొంది ఐటీఐ పూర్తిచేసిన విద్యార్థులకు టీజీఎస్‌ ఆర్టీసీ డిపోల్లో అప్రటిస్‌ షిప్‌ సౌకర్యం కూడా కల్పిస్తుంది. గుర్తింపు పొందిన సంస్థలో అప్రంటిస్‌షిప్‌ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుంది. దీంతో ఆర్టీసీ కళాశాలల్లో ఐటీఐ చేయడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. హైదరాబాద్‌ ఐటీఐ కలాశాల వివరాలకు ఫోన్‌ నంబర్లు 910066452, 040–23450033 నంబర్లలో, వరంగల్‌ ఐటీఐ కళాశాల వివరాలకు 9849425319, 8008136611 నంబర్లలో సంప్రదించవచ్చు. పూరిత వివరాలు https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి.