Google Pixel Fold: సెర్చ్ ఇంజన్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. లేటేస్టుగా ఈ కంపెనీ మరో కొత్త మొబైల్ ను తీసుకొచ్చింది. ఆయితే మిగతా వాటికంటే భిన్నంగా ఈసారి ఫోల్డింగ్ మొబైల్ ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. దీని ఫీచర్స్, ప్రైస్ ఆకర్షనీయంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మొబైల్ గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక కొత్త ఫీచర్లతో పాటు AI ఫెసిలీటీస్ ఉండే ఈ ఫోల్డింగ్ మొబైల్ ను 2023 మే 10న రాత్రి 10.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గూగుల్ ఫోల్డింగ్ మొబైల్ కోసం స్మార్ట్ ఫోన్ యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు. అసలు దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
గూగుల్ నుంచి రిలీజ్ కాబోతున్న Google Pixel 7a ఫోల్డ్ స్పెసిఫికేషన్ ను చూస్తే 7.57 ఇంచ్ ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్, 5.78 ఇంచ్ ఔటర్ స్క్రీన్ ఉన్నాయి. టెన్సర్ జీ 2 చిప్ ను కలిగి ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ డివైజ్ 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఉన్న దీని ఫీచర్స్ పై అనుమానం ఉన్నాయని కొందరు అంటున్నారు. సంస్థ నేరుగా ప్రకటించేవరకు ఫీచర్స్ గురించి అప్పుడే కన్ఫామ్ కావొద్దని సూచిస్తున్నారు.
ఈ మొబైల్ ప్రత్యేకత విషయానికొస్తే 360 డిగ్రీల పోల్డింగ్ ఉంటుందని తెలుస్తోంది. ల్యాప్ టాప్ మోడల్ వలె స్క్రీన్ సేఫ్ గా ఉంటుంది. డిఫరెంట్ లుక్ లో ఉన్న దీనిని సొంతం చేసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే గూగుల్ సంస్థ మొదటిసారి ఆండ్రాయిడ్ మొబైల్ ను మార్కెట్లోకి తెస్తోంది. ఈ తరుణంలో దీనిప్రైస్ వివరాలు ఇప్పటికే మీడియాలో రిలీజ్ చేసిందని కొందరు అంటున్నారు. వాటి వివరాల ప్రకారం పిక్సెల్ ఫోల్డ్ ప్రైస్ రూ.1.47 లక్షలు ఉంటుందని అంచనాకు వస్తున్నారు.
గూగుల్ పిక్సల్ ఫోల్డ్ సామ్ సంగ్ కు చెందిన ప్రైమరీ, కవర్ డిస్ ప్లేతో వస్తాయని తెలుస్తోంది. 1840 x2028 పిక్సెల్ రెసల్యూషన్ ఉండే విధంగా తయారు చేశారని చర్చించుకుంటున్నారు. పిక్సల్ పోల్డ్ వెనుక 3 కెమెరాలు ఉన్నాయని వీడియో చూస్తే తెలుస్తోంది. సోనీ IMX87 ప్రైమరీ కెమెరా, సోనీ IMX386 అల్ట్రా వైడ్ కెమెరా, మరోటెలిఫొటో లెన్స్ ఉంటాయని తెలుస్తోంది. పిక్సెల్ ఫోల్డ్ ను పిక్సెల్ 6 సిరీస్ తో పాటు గత సంవత్సరమే గూగుల్ విడుదల చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ డిజైన్ లో మార్పులు, తదితర కారణాలతో మే 10 న రాత్రి మార్కట్లోకి తీసుకొస్తుంది.