Google Gemini Images: కొత్త ఒక వింత. పాత ఒక రోత. ఈ సామెత టెక్నాలజీ ప్రపంచానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది. రోజురోజుకు ఒకసారి కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే టెక్నాలజీ గురించి ఒక ముక్కలో చెప్పడం కష్టం. ప్రస్తుతం కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇందులో వచ్చిన మార్పులు అనేక రకాలైన విప్లవాలకు నాంది పలుకుతున్నాయి. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో పెను మార్పులకు కారణమవుతున్నాయి.
కృత్రిమ మేధ వల్ల అనేక రకాలైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3d బొమ్మలను కృత్రిమ మేధ ద్వారా రూపొందించడానికి అందరూ తెగ ఆరాటపడుతున్నారు. ఈ ఫీచర్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నది. అందువల్లే టెక్ కంపెనీలు కృత్రిమ మేధ ద్వారా సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. గతంలో జిబ్లీ ఉండగా.. ఇప్పుడు గూగుల్ నానో బనానా అందుబాటులోకి వచ్చింది. ఇది అందుబాటులోకి రావడమే ఆలస్యం అందరూ ఈ ఫీచర్ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆ క్రేజ్ వల్ల కేవలం ఒకే ఒక నెలలో 500 కోట్ల ఇమేజ్ లను google సృష్టించింది. ఇదే విషయాన్ని గూగుల్ సీఈవో సుందర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనిని ఫ్లాష్ ఇమేజ్ టూల్ అని పిలుస్తుంటారు. దీని ద్వారా పలు మోడల్స్ లో ఇమేజ్ లను సృష్టించుకోవచ్చు. దీని ద్వారా సాధారణ ప్రజల నుంచి మొదలు పెడితే సెలబ్రిటీల వరకు తమ ఇమేజ్ లను సృష్టించుకున్నారు.
ఇలాంటి ప్రయోగాల ద్వారా గూగుల్ జెమిని ఏకంగా 500 కోట్ల మార్క్ ను అనుకోవడం పట్ల.. ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్, గూగుల్ జెమిని వైస్ ప్రెసిడెంట్ జోష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. 500 కోట్ల మార్క్ దాటిన తర్వాత.. తదుపరిచిత్రం తన దయ అంటూ సుందర్ పిచాయ్ తన ఇమేజ్ షేర్ చేయడం విశేషం. కృత్రిమ మేధ లో పెద్ద పెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పడుతున్నాయి. గూగుల్ కూడా ఇందులో భారీగానే పెట్టుబడులు పెట్టింది. పెట్టిన పెట్టుబడి తగ్గట్టుగానే సరికొత్త ఆవిష్కరణలు తీసుకొస్తూ అదరగొడుతోంది. మిగతా కంపెనీల కంటే విభిన్నమైన ఆవిష్కరణలతో గూగుల్ ముందు ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.