Karnataka: ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా సరే.. మనదేశంలో జెన్ జెడ్ ఉద్యమం రావాలని కోరుకుంటున్నారు. నేపాల్ తరహాలోనే యువత ఉద్యమించాలని పిలుపునిస్తున్నారు. అలాంటి ఉద్యమం వల్ల చెలరేగిపోయే మంటల్లో చలికాచుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఏ నాయకుడైనా సరే అధికారంలోకి రావాలని అనుకుంటాడు. ప్రజలను పరిపాలించాలని భావిస్తుంటాడు. కానీ రాహుల్ గాంధీ తన పార్టీని బలోపేతం చేసుకోకుండా.. తన పార్టీలో జరుగుతున్న తప్పులను సమీక్షించుకోకుండా.. తనకోసం ప్రజల ఉద్యమాలు చేస్తే అధికారంలోకి వస్తానని కలలు కంటున్నాడు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి లక్షణం ఇది కాదు. ఎందుకంటే ప్రజా సమస్యలపై పోరాడాలి. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయాలి. ప్రజలలో నమ్మకాన్ని పెంచుకోవాలి. ప్రజలు ఓట్లు వేస్తే గెలవాలి.. అప్పుడే అధికారం సాధ్యమవుతుంది. కానీ ఈ విషయాన్ని రాహుల్ గాంధీ మర్చిపోతున్నారు.
రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్న జెన్ జడ్ ఉద్యమం.. ఆయన పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మొదలైంది. కర్ణాటక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అక్కడికి యువత రోడ్లమీదకి ఎక్కింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా వేలాదిమంది రోడ్లమీదకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెన్ జెడ్ ఆశలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం యువత ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని ఆరోపించారు.
ఇక ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని.. ముఖ్యంగా ఐటీ రాజధాని అని చెప్పుకునే బెంగళూరులో రోడ్లు ఏమాత్రం బాగోలేవని బ్లాక్ బాక్స్ అనే కంపెనీ ఆరోపించింది. బెంగళూరు నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది.. ఆ కంపెనీ ఆ నిర్ణయాన్ని ప్రకటించడమే ఆలస్యం.. మిగతా రాష్ట్రాలు కీలక ప్రకటన చేశాయి. తన ప్రాంతంలోకి రావాలని ఆహ్వానం కూడా పలికాయి.. ఓటు చోరీ అంటూ.. ఓట్ల గల్లంతు అంటూ.. జన్ జడ్ ఉద్యమం అంటూ రకరకాల పల్లవులను ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ అందుకుంటున్నారు. కాని చివరికి తన పార్టీ అధికారంలోనే రాష్ట్రంలోనే జన్ జడ్ ఉద్యమం మొదలవుతుందని కలలో కూడా ఊహించలేదు.. అందుకే మన ఇంటి పరిస్థితిని చూసుకున్న తర్వాతే.. పొరుగింటి గురించి ఆలోచించాలని పెద్దలంటుంటారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Rahul Wanted Gen-Z protest in India.
Gen-Z has started protesting against Congress
Civil service aspirants under the All Karnataka Students’ Association hit the streets demanding recruitment for pending posts, including police constables.
— The Jaipur Dialogues (@JaipurDialogues) September 25, 2025