Google Chrome: క్రోమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్.. దీనివల్ల ఎలాంటి ఉపయోగమంటే?

గూగుల్ క్రోమ్ లో లిజన్ టు దిస్ పేజీ అనే ఫీచర్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది. దీనిని వాడాలంటే మూడు చుక్కల మెనూ గుర్తు ను క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మినీ ప్లేయర్ ఓపెన్ అవుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 2, 2024 9:02 am

Google Chrome

Follow us on

Google Chrome: ఆండ్రాయిడ్ వాడేవారికి గూగుల్ క్రోమ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ బిల్ట్ గా తయారీ సంస్థలు గూగుల్ క్రోమ్ ను ఫోన్ లోనే ఏర్పాటు చేస్తున్నాయి. రోజురోజుకు టెక్నాలజీలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. యూజర్లకు సరికొత్త అనుభూతి అందించేందుకు క్రోమ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల యూజర్లకు మరింత వేగవంతమైన సమాచారం లభిస్తుందని గూగుల్ చెబుతోంది.

ఇన్ బిల్ట్ గా ఉంటుంది

గూగుల్ క్రోమ్ లో లిజన్ టు దిస్ పేజీ అనే ఫీచర్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది. దీనిని వాడాలంటే మూడు చుక్కల మెనూ గుర్తు ను క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మినీ ప్లేయర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్లే, పాజ్ బటన్లు ఉంటాయి. ప్రోగ్రెస్ బార్, ప్లే బ్యాక్ స్పీడ్ అనే ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు దీని సహాయంతో వెబ్ పేజీని వినొచ్చు. ఇతర గొంతుల్లో, చివరికి పలు భాషల్లోనూ వినే సౌలభ్యం ఉంటుంది. అరబిక్, బెంగాలీ, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్ , జపనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ వంటి భాషల్లో కూడా వెబ్ పేజీని సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ స్క్రీన్ లాక్ అయినప్పటికీ ఆడియోను వినే అవకాశం ఉంటుంది.

ఇలా ఎనేబుల్ చేసుకోవాలి..

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి. టెక్స్ట్ తో కూడిన వెబ్ పేజీని ఓపెన్ చేయాలి. గూగుల్ నిబంధన ప్రకారం ఆ పేజీలో టెక్స్ట్ ఎక్కువగా ఉండాలి.. వెబ్ పేజీ మొత్తం లోడ్ అయిన తర్వాత.. దానిపైన కుడి వైపున మూలన మూడు నిలువు చుక్కలు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేయాలి. వెంటనే డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో లిజన్ టూ దిస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. ఆ తర్వాత మినీ ప్లేయర్ ను ఓపెన్ చేయాలి. ఒకవేళ ప్లే బ్యాక్ స్పీడ్ ను తగ్గించడం లేదా పెంచడం చేయాలంటే ఆ మినీ ప్లేయర్ ద్వారానే నిర్వహించాలి.

ఒకవేళ గొంతు నచ్చకపోతే.. వాయిస్ అనే ఆప్షన్ మీద టచ్ చేస్తే ప్రివ్యూ కనిపిస్తుంది. అందులో అనేక రకాల గొంతునమానాలు వినిపిస్తాయి. ఒకవేళ దీనిని ఎనేబుల్ చేసుకోవాలంటే హైలైట్ టెక్స్ట్ అండ్ ఆటో స్క్రోల్ ను క్లిక్ చేయాలి. అయితే ఈ సౌలభ్యం ప్రస్తుతం కొంతమందికి మాత్రమే గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని త్వరలో విస్తరించినందుకు ప్రయత్నాలు చేస్తున్నామని గూగుల్ చెప్తోంది. ప్రస్తుతం గూగుల్ క్రోమ్ వెర్షన్ 125, ఇతర వాటిల్లోనూ తాజా ఫీచర్ అందుబాటులో ఉంది.