Mobile Is Hacked: మీ మొబైల్ హ్యాక్ అయిందో లేదో ఈ చిన్ని ట్రిక్ ద్వారా తెలుసుకోండి..

మానవ జీవితంలో మొబైల్ ప్రధాన అవసరంగా మారింది. ప్రస్తుతం ఫోన్ లేకపోతే ఏ పని చేయలేమన్ స్థితిలోకి వచ్చారు. ఈ క్రమంలో మొబైల్ నుంచే ఆర్థిక వ్యవహారాలు జరుపుతుండడంతో కొంతమంది హ్యాకర్లు మొబైల్ ను తస్కరిస్తున్నారు.మరికొంత మంది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు వివరాలు తెలుసుకొని అకౌంట్ నుంచి డబ్బును ఖాళీ చేస్తున్నారు.

Written By: Srinivas, Updated On : October 26, 2024 12:02 pm

mobile-is-hacked-or-not

Follow us on

Mobile Is Hacked: మానవ జీవితంలో మొబైల్ ప్రధాన అవసరంగా మారింది. ప్రస్తుతం ఫోన్ లేకపోతే ఏ పని చేయలేమన్ స్థితిలోకి వచ్చారు. ఈ క్రమంలో మొబైల్ నుంచే ఆర్థిక వ్యవహారాలు జరుపుతుండడంతో కొంతమంది హ్యాకర్లు మొబైల్ ను తస్కరిస్తున్నారు.మరికొంత మంది మొబైల్ ఫోన్ ద్వారా బ్యాంకు వివరాలు తెలుసుకొని అకౌంట్ నుంచి డబ్బును ఖాళీ చేస్తున్నారు. తాజాగా కొత్తరకంగా మోసానికి తెరలేపారు. కొందరు సాయం చేయమని, లేదా కాల్ చేసుకుంటామని చెప్పి బ్యాంకు వివరాలను తెలుసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యాపారి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 99 వేలు హ్యాకర్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇటువంటి ట్రాప్ లో పడకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయాలి. అదేంటంటే?

సమాజంలో ఒకరికి మరొకరు సాయం చేయాలి. అది ధర్మం. కానీ కొందరు ఇదే అదనుగా సాయం చేసిన వారినే మోసం చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యాపారి వద్దకు ఓ వ్యక్తి వచ్చి కాల్ చేసుకోవాలని చెప్పాడు. ఇందుకోసం ఒకసారి మొబైల్ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆ వ్యాపారి నమ్మి అతడికి మొబైల్ ను ఇచ్చాడు. అయితే ఆ తరువాత ఆ వ్యాపారి తన బిజినెస్ వ్యవహారాల్లో బిజీ అయిపోయాడు. ఇంతలో ఫోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి మొబైల్ ఇచ్చి వెళ్లిపోయాడు. కానీ ఆ తరువాత రాత్రి సమయం వరకు ఆ వ్యాపారి బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 99 వేలు కట్ అయినట్లు మెసెజ్ వచ్చింది. దీంతో షాక్ అయిన వ్యాపారి అసలు సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తించాడు.

తన ఫోన్ తీసుకున్న వ్యక్తి ఏదో నెంబర్ ఎంట్రీ చేశాడని అనుకున్నాడు. ఆయితే ఆ తరువాత తేలిందేంటే ఆ వ్యక్తి వ్యాపారి మొబైల్ కు సంబంధించిన కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ను ఓకే చేశాడు. దీంతో కాల్స్ తో పాటు మెసేజ్ లు అన్నీ హ్యాకర్ కు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో బ్యాంకుకు సంబంధించిన ఓటీపీలు కూడా వెళ్లాయి. దీంతో ఓటీపీలు ఎంట్రీ చేసి వ్యాపారికి సంబంధించిన డబ్బును కాజేశాడు. అయితే ఆ వ్యక్తి వ్యాపారికి చెందిన మొబైల్లో *40# ఎంట్రీ చేసి ఆ తరువాత తన మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేశాడు. దీంతో ఇది కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ ఎనెబుల్ అయింది. దీంతో వ్యాపారికి సంబంధించిన అకౌంట్ హ్యాక్ అయింది.

అయితే ఇలాంటి కాల్ ఫార్వార్డ్ బారిన పడకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మొబైల్ ను చెక్ చేసుకోవాలి. అందుకోసం కాల్ యాప్ లోకి వెళ్లి *#21# అని డయల్ చేయాలి. దీంతో కాల్ ఫార్వార్డ్ ఆప్షన్ ఆన్ లో ఉంటే ఇందులో చూపిస్తుంది. ఒకవేళ కాల్ ఫార్వార్డింగ్ ఆప్షన్ ఆన్ లో ఉంటే ఆఫ్ చేసుకోండి. అయితే ఆఫ్ చేసుకోవాలంటే ##002# అని డయల్ చేయాలి. దీంతో కాల్ ఫార్వార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. దీంతో ఫోన్ కాల్స్ ఇతరులకు వెళ్లవు. దీంతో అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు.