Facebook Whatsapp Instagram Down: ఫేస్ బుక్ పనిచేయడం లేదు. వాట్సాప్ లాగ్ అవుట్ అని వస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఎర్రర్ చూపిస్తోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ట్విట్టర్లో ఏకంగా మెటా షట్ డౌన్ అనే ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సోషల్ మీడియా మెసేజ్ యాప్ గా వాట్సప్ కొనసాగుతోంది. దీనికి దాదాపు 5 బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో మెటా కంపెనీ దీనిలో అనేక రకాలుగా మార్పులు తీసుకొస్తోంది. ఫేస్ బుక్ ను కూడా చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని కోట్లాదిమంది వాడుతున్నారు. ఈ రెండు యాప్స్ తర్వాత ఇన్ స్టా గ్రామ్ కు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రెటీల నుంచి మొదలుపెడితే సామాన్యుల వరకు వీటిని వాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో వీటి సేవలలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. మెటా కంపెనీ ఎప్పటికప్పుడు సాంకేతిక లోపాల వల్ల అలా జరుగుతోందని.. ఈ అంతరాయం స్వల్పకాలం మాత్రమేనని చెబుతోంది. అయితే తాజాగా ఈ మూడు యాప్స్ పనిచేయడం లేదు.. మూడు కూడా లాగ్ అవుట్ లేదా ఎర్రర్ అని మెసేజ్ చూపిస్తున్నాయి. దీంతో చాలామంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు..
దైనందిన జీవితంలో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అనేవి అత్యంత ముఖ్యంగా మారిపోయాయి. సందేశాల నుంచి మొదలు పెడితే వీడియోల వరకు ప్రతిదీ వీటి ద్వారానే నడిచిపోతుంది. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో.. వీటి పనితీరు మరింత మెరుగుపడింది. రకరకాల సేవలు వీటి ద్వారానే సాగడం మొదలైంది. అయితే స్వల్పకాలం ఇవి పని చేయకపోవడంతో మనదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో తరుచు ఈ అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పదేపదే సాంకేతిక లోపాలు ఎందుకు తలెత్తుతున్నాయో అర్థం కాని పరిస్థితి. గతంలో కూడా మెటా కంపెనీలో ఇదే తరహాలో సాంకేతిక లోపాలు వెలుగు చూశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత కంపెనీ సేవలను పునరుద్ధరించింది. ఆ సాంకేతిక లోపాలను సవరించడానికి చాలా సమయం మెటా కంపెనీకి పట్టింది. మళ్లీ ఇప్పుడు అవే సమస్యలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మెటా కంపెనీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు.

