Site icon OkTelugu

Pawan Kalyan And Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కి కథ చెబితే ఇది నాతో వద్దు మహేష్ బాబు తో చేయండని చెప్పాడా..?

Mahesh Babu And Pawan Kalyan

Mahesh Babu And Pawan Kalyan

Pawan Kalyan And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో భారీ సక్సెస్ లను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి… రీసెంట్ గా ఆయన చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సైతం రిలీజ్ అయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఒకానొక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక స్టార్ డైరెక్టర్ ఒక కథను తీసుకొచ్చాడు. ఆ కథ విన్న పవన్ కళ్యాణ్ అది నాకంటే మహేష్ బాబు కి బాగుంటుందని ఆ దర్శకుడితో చెప్పారట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఆ కథ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. జల్సా సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖలేజా సినిమా కథని పవన్ కళ్యాణ్ కి వినిపించాడట.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆ కథ నాకంటే మహేష్ కి బాగా సెట్ అవుతుందని త్రివిక్రమ్ తో చెప్పడంతో ఆయన మహేష్ బాబును అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. తద్వారా ఖలేజా సినిమాలో మహేష్ బాబు కామెడీ యాంగిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక సినిమా ఎందుకు ప్లాప్ అయిందో తెలియదు గానీ మొత్తానికైతే ఆ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా ప్రతి ఒక్కరు ఆ మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు…

పవన్ కళ్యాణ్ చెప్పిన మాటైతే నిజం… అది మహేష్ బాబుకి బాగా సెట్ అయింది కానీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా స్క్రీన్ ప్లే ని త్రివిక్రమ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఏదో తక్కువ అయిందని అభిప్రాయపడ్డారు.

కానీ ఈ సినిమా రీ రిలీజ్ లో గాని, టీవీల్లో కానీ ప్రేక్షకులు విపరీతంగా అలరించింది. ఇక ఖలేజా మూవీ పవన్ కళ్యాణ్ కి పడాల్సిందని తెలుసుకున్న అతని అభిమానులు ఈ సినిమా పవర్ స్టార్ కి పడుంటే కూడా బాగానే ఉండేది కదా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

Exit mobile version