Elon Musk : భూగోళాన్ని దున్నేస్తున్నాడు.. చివరికి అంతరిక్షాన్ని కూడా వదిలిపెట్టడం లేదు… ఎలాన్ మస్క్ పై ఖగోళ శాస్త్రవేత్తల మండిపాటు

టెస్లా అధినేతగా.. ట్విట్టర్ అధిపతిగా.. న్యూరా లింక్ ఓనర్ గా ఎలాన్ మస్క్ ప్రపంచానికి తెలుసు.. అతిపెద్ద ధనికుడైన మస్క్ కు మాత్రం ప్రపంచం అంటే అలుసు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 20, 2024 10:22 pm

Elon Musk

Follow us on

Elon Musk : డబ్బున్నదని పొగరు.. ఆయాచితంగా వచ్చి పడుతున్న సొమ్మును చూసి మిడిసిపాటు.. మస్క్ ను మెంటల్ కేసు గా మార్చాయి. అందువల్లే అతనికి తిక్కనేది అబ్బింది. ఫలితంగా అతడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ మస్క్ పట్టించుకోడు. తనకోసం.. తన సంపాదన కోసం మస్క్ ఏమైనా చేస్తాడు.. ఎంత దాకైనా వెళ్తాడు. ప్రపంచం ఏమైపోయినా లెక్కపెట్టడు. అయితే అతడి తీరు పట్ల ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. ఈ సువిశాల భూమిపై అన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో మాస్క్ రకరకాల పనులు చేస్తున్నాడు. ఇందులో భాగంగా స్టార్ లింక్ శాటిలైట్లను ఏర్పాటు చేశాడు. వీటివల్ల గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సాధ్యమవుతుందని మస్క్ చెబుతున్నాడు. ఇప్పటికే ఈ శాటిలైట్లు ఆ పనిని మొదలుపెట్టాయి.. అయితే ఇవి తమ పరిశోధనలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. స్టార్ లింక్ ఉపగ్రహాలు కొత్త తరానికి చెందినవి కావడంతో.. అవి అత్యంత కీలకమైన రేడియో సిగ్నల్స్ ను అడ్డుకుంటున్నాయి.. దీనివల్ల ఖగోళ శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు బ్రేక్ పడుతోంది. ఖగోళ శాస్త్రవేత్తలు కొంతకాలంగా కృష్ణ బిలాలు, భూమికి సుదూరంగా ఉన్న గెలాక్సీ ల పై ప్రయోగాలు చేస్తున్నారు. అయితే మస్క్ శాటిలైట్లు రేడియో సిగ్నల్స్ ను అడ్డుకోవడం వల్ల ఈ ప్రయోగాలలో పురోగతి ఉండడం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ లింక్ ఉపగ్రహాల వల్ల సమస్య

విశ్వం పుట్టుక, ఇతర విషయాల గురించి తెలుసుకోవడానికి “ది యూరి పోయిన్” అనే సంస్థ ఫ్రీక్వెన్సీ అర్రే రేడియో టెలిస్కోపిక్ నెట్వర్క్ పనితీరుపై కొంతకాలంగా పనిచేస్తోంది. రకరకాల అధ్యయనాలు చేస్తోంది. అయితే స్టార్ లింక్ సాటిలైట్స్ వల్ల తమ పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతోందని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నానాటికి స్టార్ లింక్ ఉపగ్రహాల సంఖ్య పెరగడం.. తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని ఆ సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తల బృందం ఆరోపిస్తోంది. స్పేస్ ఎక్స్ నుంచి వచ్చే రేడియో ఉద్గారాలు… ఎక్సో ప్లానెట్స్, బ్లాక్ హోల్స్ వంటి వాటిని గుర్తించే LOFAR సామర్థ్యానికి ఇబ్బంది కలిగిస్తున్నాయని ది యూరి పోయిన్ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. ” గడచిన ఏడాది మా ప్రయోగాలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రారంభంలో మా ఆలోచన వేరే విధంగా ఉండేది.. లోతుగా పరిశీలన చేస్తే అవి భూ ఉపరితల కక్ష్య లో తిరుగుతున్న మొదటి తరం స్టార్ లింక్ శాటిలైట్ల ద్వారా వస్తున్నాయని మాకు తెలిసిపోయిందని” ది యూరి పోయిన్ సంస్థ సైంటిఫిక్ అండ్ జనరల్ డైరెక్టర్ జెస్సికా డెంప్ సే స్పష్టం చేశారు..

6 వేలకు పైగా శాటిలైట్లు

ప్రపంచవ్యాప్తంగా మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ 6000కు పైగా శాటిలైట్లను నిర్వహిస్తోంది. ఇవి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్, లోఫార్ లాంటి రేడియో టెలిస్కోప్ సిగ్నల్స్ కు పదేపదే అంతరాయం కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఈ అవరోధాన్ని ప్రారంభంలో గుర్తించని శాస్త్రవేత్తలు.. శాటిలైట్ లోని బ్యాటరీల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించారు. అయితే స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్ లింక్ వీ2 మినీ శాటిలైట్ల ప్రయోగం తర్వాత ఈ అవరోధం తారాస్థాయికి చేరిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.