Johnny Master’s wife : ప్రముఖ కొరియా గ్రాఫర్ జానీ మాస్టర్ ని నిన్న గోవా లో అరెస్ట్ చేసి నేడు హైదరాబాద్ లోని ఉప్పర్ పల్లి కోర్టుకి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. ఉప్పర్ పల్లి కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా, పోలీసులు జానీ మాస్టర్ ని చంచల్ గూడా జైలుకి తరలించారు. అయితే రిమాండ్ రిపోర్టు లో జానీ మాస్టర్ నేరాన్ని ఒప్పుకున్నట్టు కొన్ని ప్రముఖ మీడియా చానెల్స్ ప్రచారం చేసాయి. కాసేపటి క్రితమే మీడియా తో మాట్లాడిన జానీ మాస్టర్ భార్య సుమలత, ఈ వార్తపై స్పందిస్తూ ‘రిమాండ్ రిపోర్టు లో జానీ మాస్టర్ నేరాన్ని ఒప్పుకున్నాడు అంటూ మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. మా చేతికి ఇంకా రిమాండ్ రిపోర్టు రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాము. మీడియా ప్రచారం అవుతున్నది కేవలం ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు మాత్రమే. నేను కూడా అలాంటి ఆరోపణలు వంద చేయగలను’ అంటూ చెప్పుకొచ్చింది సుమలత.
యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ ‘విశ్వక్ సేన్ సినిమాలో శ్రేష్టి వర్మ కి కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చింది. కానీ జానీ మాస్టర్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆమెను ఆ సినిమా నుండి తప్పించారు అని ఆరోపణలు చేసింది. కానీ మేము ఆ మూవీ టీం ని సంప్రదించాము, ఒక రోజులో 30 షాట్స్ తీసే టార్గెట్ ని డైరెక్టర్ ఇస్తే, శ్రేష్టి వర్మ కనీసం 15 షాట్స్ కూడా తీయలేకపోయింది. కేవలం 7 షాట్స్ మాత్రమే తీసింది. ఆమె వర్క్ చాలా నెమ్మదిగా ఉండడంతో ఆ చిత్రం నుండి తీసేశామని చెప్పారు..దీనిపై మీ స్పందన ఏమిటి?’ అని అడగగా, దానికి సుమలత సమాధానం ఇస్తూ ‘ఆ అమ్మాయికి కార్డు ని ఇచ్చి ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చింది మేము, ఆమెకి అవకాశాలు ఇప్పించింది మేము, అలాంటిది మేమెందుకు ఆమెకు అవకాశాలు రానివ్వకుండా చేస్తాము?, ఇదంతా పూర్తిగా నాటకాలే. విశ్వక్ సేన్ ఈమె పని నిదానంగా ఉండడం తో తప్పించారు’ అని చెప్పుకొచ్చింది సుమలత.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇది ఇంత పెద్ద సంఘటన గా మారుతుందని ఆ అమ్మాయి కూడా అనుకోని ఉండదు. ఎదో జానీ మాస్టర్ ని బెదిరించాలని కేసు పెట్టింది. FIR లో ఏదేదో చెప్పేసింది. ఆ అమ్మాయిది సైకో మెంటాలిటీ. ఏవేవో ఆమెకి ఆమె ఊహించుకొని, ప్రతీ ఒక్కటి జానీ మాస్టర్ చేయిస్తున్నాడు అనుకోని ఇలా చేస్తుంది, ఆమె వెనుక కొంతమంది సినీ పెద్దలు కూడా ఉన్నారు. జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుండి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నా భర్తపై ఇది వరకే వాళ్ళు అనేక కుట్రలు చేసారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఢీ షో చేసే సమయంలో ఆ అమ్మాయి వయస్సు 18 ఏళ్ళ పైన ఉంటుంది. కానీ FIR లో 16 ఏళ్ళు అని పేర్కొంది, ఆ అమ్మాయి చెప్పేవి మొత్తం అబద్దాలే అంటూ ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.