Sunita Williams Birthday: అంతరిక్షంలో సునీతా విలియమ్స్‌ పుట్టిన రోజు.. ఎలా జరుపుకుందో తెలుసా?

ఎనిమిది రోజుల అంతరక్షి పర్యటనకు వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యతో అక్కడే చిక్కుకుపోయింది. మూడు నెలలుగా అక్కడే ఉంటున్న సునీత.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తుందని భావిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 20, 2024 4:13 pm

Sunita Williams Birthday

Follow us on

Sunita Williams Birthday: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో పరిశోధనల కోసం ఎనిమిది రోజుల పర్యటన కోసం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌తో కలిసి జూన్‌ 6 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమ నౌకలో వీరు అంతరిక్ష కేంద్రానికి బయల్దేరారు. మార్గం మధ్యలోనే వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే ఇద్దరూ క్షేమంగా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ఇక వారం రోజుల్లో తిరిగి భూమికి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సమస్యల కారణంగా అక్కడే ఉండిపోయారు. స్టార్‌ లైనటర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తిరుగు ప్రయాణాన్ని నాసా వాయిదా వేసింది. ఇద్దరి రాక కోసం అమెరికాలోని వారి కుటుంబ సభ్యులు, కోట్లాది మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. భారత దేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలో కూడా సునీతా విలియమ్స్‌ పూర్వీకులు ఝులాసన్‌ గ్రామంలో పూజలు చేస్తున్నారు.

సెప్టెంబర్‌ 19 పుట్టిన రోజు..
ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 19న సునీతా విలియమ్స్‌ పుట్టిన రోజు. 59వ పుట్టి రోజు ఆమో అంతరిక్షంలోనే జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సునీతా పూర్వీకులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. త్వరగా భూమిపైకి రావాలని కోరుకుంటూ పూజలు చేశారు. ఇక సునీత తన 59వ పుట్టిన రోజును భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్‌ఎస్‌లోనే జరుపుకున్నారు. పుట్టిన రోజునాడు సునీత బిజీగా గడిపారు. సహచర వ్యోమగామి విల్మోర్‌తో కలిసి స్పేస్‌ స్టేషన్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టంలను శుభ్రం చేసుకున్నారు. స్మోక్రెటెక్టర్ల పనితీరును పరీక్షించారు. ఇదంతా సాధారణమే అయినా.. ఐఎస్‌ఎస్‌లో ఉన్న వారి ఆరోగ్యం, భత్ర చాలా కీలకమని వ్యోమగాములు చెబుతున్నారు.

మిషన్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌తో సమావేశం..
మరోవైపు సునీత విలియమ్స్‌ బుచ్‌ విల్మోర్‌.. హ్యూస్టన్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా వ్యోమగాముల లక్ష్యాలు, చేయాల్సిన పనులు, వివిధ శాస్త్రీయ అ«ధ్యయనాలపై చర్చించాఉ. కాగా, సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలో పుట్టిన రోజు జరుపుకోవడం ఇది రెండోసారి. 2012లో ఆమె తన పుట్టిన రోజులు ఐఎస్‌ఎస్‌లోనే జరుపుకున్నారు.

ప్రజలకు సందేశం..
మరోవైపు ఇద్దరు వ్యోమగాములు ఇటీవల ప్రజలనుద్దేశిచి మాట్లాడారు. సునీతా విలియమ్స్‌ మాట్లాడుతూ బోయింగ్‌ మమ్మల్ని విడిచి వెల్లడం కఠన వ్యవహరా అనిపిస్తోంది. దీంతో మరికొన్ని నెలలు ఐఎస్‌ఎస్‌లోనే గడపాల్సి ఉంది. అయినా అంతరిక్షంలో ఉండడం ఆనందంగా ఉంది అని తెలిపారు. కుటుంబ సభ్యులను మిస్‌ అవుతున్నా.. ఇక్కడ ఉండడంలో ఎలాంటి ఇబ్బంది లేదని బుచ్‌ విల్మోర్‌ తెలిపారు.