WhatsApp: ప్రస్తుత కాలంలో వాట్స్అప్ వాడని వారు లేరు. ప్రతి పని కోసం వాట్సాప్ తప్పనిసరిగా వాడుతున్నారు. అయితే వాట్సాప్ లోనే సర్వ సమాచారం ఉండడంతో సైబర్ నేరగాళ్లు వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికి దీనిని హ్యాక్ చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎన్ని విధాలుగా సెక్యూరిటీ ఆప్షన్లు ఏర్పాటు చేసుకున్నా.. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసం చేస్తున్నారు. ఇటీవల కొన్ని వాట్స్అప్ గ్రూపుల్లోకి రకరకాల మెసేజ్లు వస్తున్నాయి. వీటిలో ఈ కొత్త రకమైన మెసేజ్ ఆందోళన కలిగిస్తుంది. దీనిపై ఇప్పటికే ఎన్నో రకాల ప్రచారం జరిగినా కూడా వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికి సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసం చేస్తున్నారు. అదెలా ఉందంటే?
వాట్సాప్ లో ప్రతిరోజు వేలకొద్దీ మెసేజ్లు వీక్షిస్తూ ఉంటాం. కొందరు ఇంపార్టెంట్ మెసేజ్ పంపిస్తూ ఉంటారు. కొందరు స్నేహితులు మాత్రమే కాకుండా ప్రభుత్వం, బ్యాంకులు తదితర సంస్థల నుంచి కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే చాలామంది వినియోగదారులు ఆన్లైన్లోనే ఎక్కువగా ఉండడంతో సంస్థలు ఇలా వాట్సాప్ కు నేరుగా మెసేజ్ పంపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో. Apk అనే ఫైల్ వినియోగదారులు ఆందోళన కలిగిస్తుంది.
బ్యాంకు, సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పేరును ఉంచి చివరకు ఇలా .apk అని ఉండడంతో చాలామంది ఇది ఏంటో అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఫైల్ ను ఓపెన్ చేయగా మొబైల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సైబర్ నేరగాళ్లకు వెళ్ళిపోతుంది. ఫలితంగా బ్యాంకు అకౌంటు తదితర విషయాలు తెలుసుకుని డబ్బులు దోచుకుంటున్నారు. అందువల్ల ఈ ఫైల్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. అయితే గతంలోనూ ఈ ఫైల్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కొత్తగా తెలిసిన పేరుతో లేదా ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన పేరును ఉంచి చివరకు ఇలా పెట్టి మెసేజ్ చేస్తున్నారు.
దీంతో ఇది ప్రభుత్వ మెసేజ్ అని అనుకొని చాలామంది ఓపెన్ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన ఫైల్ కు ఇలా .apk ఉండడంతో చాలామంది.. ఇది ప్రభుత్వానికి సంబంధించిన మెసేజ్ అని ఓపెన్ చేశారు. అలా చాలామంది తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రభుత్వ సంస్థ లేదా కంపెనీ గురించి తెలుపుతూ లాస్ట్ కు ఇలా పెట్టి మెసేజ్ చేస్తున్నారు. అయితే ఈ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలుపుతున్నారు. ఈ మెసేజ్ ఎక్కడ కనిపించినా వెంటనే వాటిని డిలీట్ చేయాలని.. లేదా సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంటున్నారు. స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి ఈ రకమైన ఫైల్ ను ఎట్టి పరిస్థితుల్లో ఫార్వర్డ్ చేయకూడదని.. ఒకవేళ అలా ఫార్వర్డ్ చేసిన పోలీసుల నుంచి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరం హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఈ ఫైల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు.