AP DSC Candidates: ఏపీలో( Andhra Pradesh) ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్. నిన్ననే మెరిట్ జాబితా విడుదలైంది. ఈ తరుణంలో మెరిట్ అభ్యర్థులకు ఈరోజు కాల్ లెటర్లు అందనున్నాయి. వెబ్ సైట్ లో వీటిని విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. పోస్ట్ కు ఒకరు చొప్పున వెరిఫికేషన్ కు పిలవనున్నారు. రేపటి నుంచి జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వెరిఫికేషన్కు హాజరుకాని, సర్టిఫికెట్లు సమర్పించిన వారి స్థానంలో మెరిట్ జాబితాలోని మిగతా వారికి అవకాశం కల్పిస్తారు.
Also Read: ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం
* 125 రోజుల్లో ప్రక్రియ పూర్తి..
మొత్తం 16,347 పోస్టులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్( DSC notification ) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 6 నుంచి జూలై రెండు వరకు మొత్తం 67 విభాగాల్లో పరీక్షలు జరిగాయి. మూడు లక్షల 36 వేల 307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 3.12 లక్షల మంది పరీక్షలు రాశారు. పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో ఈ డీఎస్సీ నియామక ప్రక్రియ నిర్వహించింది. టెట్ మార్కుల్లోనూ ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా అనేకసార్లు అప్డేషన్ కు అవకాశం కల్పించారు. ఎంపికైన వారి జాబితాలు నేరుగా ప్రకటించాలని భావించినా.. అభ్యర్థుల్లో అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో శుక్రవారం రాత్రి మెరిట్ జాబితాలు ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియకు 125 రోజుల సమయం పట్టింది. మరో వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
* లాగిన్ ఐడి ల ద్వారా కాల్ లెటర్లు..
డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితాలను( merit lists ) మొన్ననే విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. APDSC.IN లేదా apcfss.in అధికారిక వెబ్సైట్లో జాబితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్ ఐడీలు ద్వారా కాల్ లెటర్లు అందిస్తామని.. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఏపీ డీఎస్సీ వెబ్సైట్ అభ్యర్థుల లాగిన్ లో పాఠశాల విద్యాశాఖ కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనుంది. ఒక పోస్ట్ కు ఒకరు చొప్పున 16,347 పోస్టులకు గాను.. అంతమందిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల్లో ప్రారంభం కానుంది. ప్రతి 50 మంది అభ్యర్థులకు ఒక బృందాన్ని కేటాయించారు.