Liquor Bottle In Queue: తెలంగాణలో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అవసరమైన యూరియా లభించక రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే ప్రభుత్వం యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని చెబుతోంది. ప్రస్తుతం యూరియా కొరత ఉన్న విషయం వాస్తవమే అని.. త్వరలో అవసరమైన యూరియా వస్తుందని అంటుంది. కానీ కొన్ని కొన్ని గ్రామాలకు యూరియా వస్తుండడంతో రైతులు ఎగబడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో యూరియా వస్తుందని తెలియడంతో రైతులు శనివారం రాత్రి నుంచే తమ పాసుబుక్కులను లైన్ లో ఉంచారు. అయితే ఒకరు మాత్రం ఏకంగా ఓ వస్తువులు ఉంచారు. ఆ వస్తువు ఇప్పుడు వీడియోలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వస్తువు ఏంటో తెలుసుకోవాలని ఉందా?
Also Read: ‘వార్నర్ బ్రదర్స్’ తో అల్లు అర్జున్..హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ కానుందా?
పంటలను కాపాడుకునేందుకు యూరియా చల్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొందరికి యూరియా అందినా.. మరికొందరికి దొరకకపోవడంతో తమకు దక్కుతుందో లేదో నన్ను ఆందోళన చెందుతున్నారు. దీంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా యూరియా కోసం క్యూలో ఉంటున్నారు. క్యూలో ఉన్న సమయంలో రైతులు తమ పాసుబుక్కులను ఉంచుతారు. ఇలా ఇందుర్తి గ్రామంలో ఒకరోజు ముందు నుంచే క్యూలో పాస్బుక్లను ఉంచారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తన వద్ద పాస్బుక్ లేదని అనుకుంటా. దీంతో క్యూలో మద్యం బాటిల్ ను ఉంచాడు. తనకు యూరియా దొరకదనే ఆందోళనతో ముందు జాగ్రత్తగా ఇలా తన వద్ద ఉన్న మద్యం సీసాను లైన్ లో పెట్టాడు. ఇది చూసినా కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని చూసినా చాలామంది అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు యూరియా కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. యూరియా కొరత ఉన్న విషయం వాస్తవమేనని.. కేంద్ర ప్రభుత్వం యూరియా కొరత సృష్టిస్తుందని రాష్ట్ర నాయకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాయకులు మాత్రం.. యూరియాను కావాలనే కొరత సృష్టించారని చెబుతున్నారు. ఏ ది ఏమైనా రైతులు యూరియా అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు మాత్రం యూరియాకు బదులు లిక్విడ్ మోనో వాడాలని చెబుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం సరైన అవగాహన కల్పించడం లేదు. అంతేకాకుండా ఒకేసారి ఇలా వేరే రకమైన రసాయనం వాడడం వల్ల పంటకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆలోచిస్తున్నారు.