BMW F 450 booking details: స్టైలిష్ బైక్ కొనాలని అనుకునే వారికి కొన్ని కంపెనీలు ప్రత్యేక మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటాయి. ఇటీవల BMW కంపెనీకి చెందిన కొత్త బైక్ గురించి ఆసక్తి రేకుతుంది. దీని నుంచి F 450 అనే బైక్ త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించి ప్రీ బుకింగ్స్ ను ఇటీవల ప్రారంభించింది. దీంతో చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు స్టైలిష్ డిజైన్ ఆకట్టుకొని ఉంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
BMW F 450 అనేది అడ్వెంచర్ మోటార్ సైకిల్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి వచ్చింది. ముందుగా దీని డిజైన్ గురించి వెళితే.. X ఆకృతిలో ఉండే LED హెడ్ లైట్స్ ఆకట్టుకుంటాయి. అలాగే స్ప్లిట్ సీట్లు ఆకట్టుకోనున్నాయి. ఇందులో ఉండే ఇంజిన్ ప్రత్యేకంగా ఉండనుంది. 420 సిసి ట్విన్ సిలిండర్ DOH ఇంజన్ తో పనిచేసే దీనికి 47.8 బీహెచ్పీ పవర్ తో పాటు 43 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ తో పనిచేసే ఇది టాప్ స్పీక్ జిఎస్ వంటివి కలిగి ఉంది. ఈ ఇంజన్ వేగానికి ప్రతిరూపం అని చెప్పవచ్చు. అలాగే ట్రాఫిక్ లోను సులభంగా బయటకి వెళ్లేందుకు ఇంజన్ అనుకూలంగా ఉంటుంది.
ఈ కొత్త బిఎండబ్ల్యూ F 450 బైక్ లో లాంగ్ ట్రావెల్ KYB USD ఫ్రంట్ పోర్క్ వంటివి ఉన్నాయి. అలాగే సస్పెన్షన్ సపోర్ట్ గా ఉండడంతో స్పోర్ట్ బైక్ మోడల్ వలే కనిపిస్తుంది. ఈ బైక్ మొత్తం 178 కిలోల బరువుతో కనిపిస్తుంది. మెరుగైన రైడ్స్ కోసం.. సౌకర్యవంతమైన హ్యాండ్లింగ్ ఉండడంతో లాంగ్ డ్రైవ్ చేసినా కూడా ఎలాంటి అలసట అనిపించదు. సీటు ఎత్తు 845 మిల్లీమీటర్లు ఉండడంతో పాటు ఆప్షనల్ యాక్సెసరీస్ ద్వారా సర్దుబాటు కూడా చేసుకోవచ్చు. ఇందులో స్మార్ట్ ఫీచర్స్ కూడా యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఈ బైక్ లో 6.5 అంగుళాల TFT డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లేలో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్టు వంటివి ఉంటాయి. అలాగే మ్యూజిక్ కంట్రోల్ కూడా ఇందులో సెట్ చేయబడింది. 19 అంగుళాల ఫ్రంట్ వీల్ తో పాటు 17 అంగుళాల బ్యాక్ చక్రం ఉండడంతో రైడింగ్ లో కొత్త అనుభూతి కలుగుతుంది.
బీఎండబ్ల్యూ F 450 బైక్ ను 2026 ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నారు. దీనిని రూ.5.5 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.