Damini lightning alert app: హైదరాబాదులో ప్రతిరోజు వర్షం కురుస్తుంది. లేటెస్ట్ గా మూసీ నది పొంగడంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాదులోని కాకుండా దేశవ్యాప్తంగా వర్షాలు విజృంభిస్తున్నాయి. అయితే వర్షాలు కురిసే సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. రైతులు, గొర్ల కాపరులు, అడవిలో పని చేసే కూలీలు పిడుగు బారిన పడి మరణిస్తూ ఉంటారు. పిడుగు అనేది ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. కానీ ఇది ఒక్కసారి భూమి పైకి మనసులో ఉండే ప్రాంతాల్లో పడితే మరణం తప్పదు. అయితే ఈ పిడుగు నుండి తప్పించుకోవడానికి ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే..
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని పనులు సులభంగా చేసుకోగలుగుతున్నాం. వ్యవసాయ రంగంలో కూడా సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మిషన్లు వ్యవసాయ రంగంలోకి వచ్చాయి. వీటితో కొన్ని పనులను కష్టం లేకుండా చేసుకోగలుగుతున్నారు. అయితే ఎక్కువగా వ్యవసాయ పనులు చేసేవారు పిడుగుల బారినపడి మరణిస్తూ ఉంటారు. వీరు పిడుగు పడే విషయాన్ని ముందే గ్రహిస్తే దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మరి పిడుగు పడే విషయాన్ని ఎవరు చెబుతారు?
ఈ పరిస్థితిని గమనించి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి Damini యాప్ నో అందుబాటులోకి తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని పూణే లో ఉన్న ఐఐటి ఇనిస్ట్యూట్ తో కలిసి దీనిని రూపొందించారు. ఈ యాప్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే పిడుగు వచ్చే 30 నిమిషాల ముందే అలర్ట్ చేస్తుంది. ఒక ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంటే మొబైల్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దీంతో ఆ ప్రదేశం నుంచి ఇతర ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జిపిఎస్ సహాయంతో ఇది పనిచేస్తుంది. పైనుంచి పిడుగు వచ్చే విషయాన్ని ముందే గ్రహించి ఫోన్కు సమాచారాన్ని అందిస్తుంది.
అయితే ఈ యాప్ ఒకవేళ రైతులకు ఉపయోగించడానికి అవగాహన లేకపోతే.. తమ కుటుంబ సభ్యులు సైతం ఇన్స్టాల్ చేసుకుని ఆపరేట్ చేయవచ్చు. తమ మొబైల్ కు వార్నింగ్ మెసేజ్ రాగానే తమ కుటుంబ సభ్యులను ఇంటికి రప్పించే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ విధంగా పిడుగుల భారీ నుంచి తప్పించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ఎంతోమంది పిడుగుల బారిన పడి మరణించారు. అడవిలోకి వర్షం వస్తే చెట్టు కిందికి వెళ్తారు. అయితే చెట్లను పిడుగులు ఎక్కువగా ఆకర్షిస్తాయి. దీంతో ఈ చెట్టు కింద ఉన్నవారు మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇకనుంచి ఈ యాప్ మొబైల్లో ఉంటే ముందే తెలుసుకొని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లవచ్చు.