Impact of Pawan Kalyan comeback: మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్… ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తునే మరో వైపు సినిమాలను చేస్తున్నాడు… సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ సంపాదించుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులందరు ఆసక్తిని చూపిస్తున్నారు. స్కూల్స్ కాలేజీలకు దసర హాలిడేస్ ఉండటంతో చాలా మంది ఫ్యామిలీస్ తో కలిసి ఈ సినిమాను చూస్తున్నారు.
మొత్తానికైతే పాన్ ఇండియాలో పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఈ మూవీ మీద పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం వాళ్ళ కామెంట్స్ ని తెలియజేస్తున్నారు… పవర్ స్టార్ తన రేంజ్ సినిమా చేసి చాలా రోజులు అవుతోంది. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఇప్పటివరకు ఆయనకి అంత పెద్ద సక్సెస్ అయితే రాలేదు.
ఇక ఇప్పుడు ఓజీ సినిమాతో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు.ఇక ఇదంతా చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన పార్ట్ టైం సినిమాలు చేస్తేనే ఇండస్ట్రి లో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇక ఫుల్ టైం సినిమాలు చేస్తే మాత్రం ఏ ఒక్క హీరో రికార్డ్ కూడా నిలబడవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆయన స్టోరీ సెలక్షన్ లో గాని, ఒక సినిమా కోసం ఆయన పెట్టే డెడికేషన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఆయన ముందు ఏ హీరో పనికిరాడు అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సైతం గతంలో జనసేన పార్టీ సభలో సినిమాల గురించి మాట్లాడుతూ నేను ప్రస్తుతానికి సినిమాల్లో యాక్టివ్ గా లేను కాబట్టి పర్లేదు. ఒకవేళ ఆ పోటీలో ఉంటే మాత్రం అది వేరే రకంగా ఉండేది అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు.
పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆయన పోటీలో ఉంటే నిజంగానే ఇప్పుడున్న స్టార్ హీరోలు చాలా వరకు డైలమాలో పడిపోయే పరిస్థితి వచ్చేది. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్వాగ్ మరోసారి ఇండస్ట్రీలో కనిపించడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…ఇక ఇప్పటికే మిగతా హీరోలు క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన లాంగ్ రన్ లో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…