Christianity Population Worldwide: ప్రపంచంలో ఎక్కువ మంది ఆచరించే మతం ఏదంటే.. చదువుకున్న ప్రతి ఒక్కరూ టక్కున చెప్పేది క్రైస్తవం.. ఆ తర్వాత స్థానాల్లో ఇస్లాం, హిందూ, బౌద్ధ మతాలు ఉన్నాయి. ఇక క్రైస్తవం ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం చెలాయంచింది. ఇప్పటికీ ఆ మతానిదే ఆధిక్యం, అయితే.. గడిచిన పదేళ్లలో క్రిస్టియానిటీని విశ్వసించేవారు తగ్గిపోయారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2020 సర్వే నివేదిక ఈ సంచలన విషయవ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన జనాభా స్వరూపంలో గణనీయమైన మార్పులను తెలిపింది. 2010 నుంచి 2020 వరకు జరిగిన ఈ మార్పులు క్రై స్తవ మతానికి షాక్ ఇవ్వగా, ఇస్లాం, హిందూ మతాలు స్థిరంగా ఉన్నాయి. ఈ సర్వే 201 దేశాల్లో నిర్వహించబడింది.
తగ్గుతున్న క్రైస్తవం ఆధిపత్యం..
ప్రపంచంలో అత్యధికంగా అనుసరించబడే మతంగా క్రై స్తవం ఇప్పటికీ నిలిచినప్పటికీ, దాని ఆధిపత్యం క్షీణిస్తోంది. 2010లో 2.18 బిలియన్ల మంది క్రై స్తవులు ఉండగా, 2020 నాటికి ఇది 2.3 బిలియన్లకు (+122 మిలియన్లు) పెరిగినప్పటికీ, ప్రపంచ జనాభాలో వారి వాటా 30.6% నుంచి 28.8%కు తగ్గింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం యూరోప్‌లోని దేశాలలో (బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఉరుగ్వే) క్రై స్తవ మతాన్ని త్యజించి మతరహిత వర్గంలోకి మారడం. 2010లో 124 దేశాల్లో క్రై స్తవులు ఆధిక్యంలో ఉండగా, 2020 నాటికి ఇది 120కి తగ్గింది. బ్రిటన్‌లో క్రై స్తవులు 49%, ఆస్ట్రేలియాలో 47%, ఫ్రాన్స్‌లో 46%, ఉరుగ్వేలో 44%కి తగ్గారు. ఈ దేశాల్లో మతరహిత వర్గం ఆధిక్యంలోకి వచ్చింది. సబ్–సహారన్ ఆఫ్రికాలో క్రై స్తవ జనాభా 24.8% నుంచి 30.7%కు పెరిగినప్పటికీ, యూరోప్‌లో జరుగుతున్న మత త్యాగం ఈ వృద్ధిని అధిగమించింది.
స్థిరంగా ఇస్లాం..
ఇస్లాం మతం 2010 నుంచి 2020 వరకు వేగంగా వృద్ధి చెందిన మతంగా నిలిచింది. ఈ కాలంలో 347 మిలియన్ల మంది ముస్లింలు పెరిగి, మొత్తం 2 బిలియన్లకు చేరుకున్నారు, ప్రపంచ జనాభాలో వాటా 23.9% నుంచి 25.6%కు పెరిగింది. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు యువ జనాభా(సగటు వయస్సు 24), అధిక జనన రేటు (ముస్లిం మహిళకు సగటున 2.9 పిల్లలు), తక్కువ మత మార్పిడి రేట్లు. 53 దేశాల్లో ముస్లిం ఆధిక్యం స్థిరంగా కొనసాగుతోంది, కొత్త దేశాలు జోడించబడకపోయినా, ఆధిపత్యం తగ్గలేదు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా ఇండోనేషియా (239 మిలియన్లు), పాకిస్తాన్ (227 మిలియన్లు), భారత్ (213 మిలియన్లు)లలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది.
హిందూ మతం.. స్థిరమైన ఆధిపత్యం
హిందూ మతం ప్రపంచ జనాభాలో 14.9% వాటాను స్థిరంగా నిలబెట్టుకుంది, 2010 నుంచి 2020 వరకు 126 మిలియన్ల మంది పెరిగి 1.2 బిలియన్లకు చేరుకుంది. భారత్ (79.8%), నేపాల్ (90%)లలో హిందూ ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌లో మత మార్పిడులు చాలా తక్కువగా ఉన్నాయి. 99% మంది హిందువులుగా పుట్టినవారు హిందూ మతంలోనే కొనసాగుతున్నారు. హిందూ జనన రేటు (మహిళకు సగటున 2.1 పిల్లలు) ప్రపంచ సగటుతో సమానంగా ఉండడం, మత మార్పిడులు తక్కువగా ఉండడం వల్ల హిందూ జనాభా స్థిరంగా ఉంది. యూరోప్ మరియు ఉత్తర అమెరికాలో హిందూ జనాభా వృద్ధి (వరుసగా 30% మరియు 55%) వలసలు ఇస్కాన్ వంటి సంస్థల ప్రభావం వల్ల జరిగింది.
పెరుగుతన్న మతరహిత వర్గం…
మతరహిత వర్గం 2010 నుంచి 2020 వరకు 270 మిలియన్ల మంది పెరిగి, 1.9 బిలియన్లతో ప్రపంచ జనాభాలో 24.2% వాటాను కలిగి ఉంది, ఇది క్రై స్తవులు, ముస్లింల తర్వాత మూడో అతిపెద్ద వర్గంగా నిలిచింది. ఈ వృద్ధి ప్రధానంగా యూరోప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో క్రై స్తవ మతాన్ని త్యజించడం వల్ల సంభవించింది. చైనా (1.3 బిలియన్లు), అమెరికా (101 మిలియన్లు), జపాన్ (73 మిలియన్లు)లలో మతరహిత వర్గం గణనీయంగా ఉంది. ఈ వర్గం సాధారణంగా వృద్ధ జనాభా, తక్కువ జనన రేటు కలిగి ఉన్నప్పటికీ, మత త్యాగం వల్ల వృద్ధి చెందింది.
యూరోప్‌లో క్రై స్తవ తిరస్కరణ..
యూరోప్‌లో క్రై స్తవ మతం తిరస్కరణకు పలు కారణాలు ఉన్నాయి. మత బోధకుల తప్పిదాలు బయటపడడం, సెక్యులరైజేషన్, మరియు వలసల వల్ల జనాభా స్వరూపంలో మార్పులు ఒక కారణం. ఇస్కాన్ వంటి సంస్థల ప్రభావంతో కొంతమంది హిందూ మతం వైపు మొగ్గుతున్నారు. యూరోప్‌లో ముస్లిం వలసలు కూడా క్రై స్తవ ఆధిపత్యాన్ని తగ్గించాయి.