Chatgpt Diet Plan: ఈ రోజుల్లో చాలామందికి శారీరక శ్రమ ఉండడం లేదు. పైగా తినే తిండిలో క్యాలరీలు అధికంగా ఉంటున్నాయి. పోషకాల కంటే రుచికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. తద్వారా సులభంగానే బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడం వరకు ఈజీగానే ఉంటున్నప్పటికీ.. తగ్గడమే ఇబ్బందికరంగా ఉంటున్నది. బరువు పెరగడం వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమస్యలే ఆ వ్యక్తి కూడా ఎదుర్కొన్నాడు. పైగా అతడు ఫేమస్ యూట్యూబర్. దీంతో బరువు తగ్గించుకోవడానికి అతను చాలా ప్రయత్నాలు చేశాడు.
Also Read: సాక్షి ఎదగలేకపోయింది.. ఈనాడు నిరూపించలేకపోయింది.. తెలుగు మీడియాకు ఇదో పాఠం..
పెరిగిన శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రతిరోజు వ్యాయామం చేసేవాడు. ఉదయం సాయంత్రం వాకింగ్ వెళ్లేవాడు. తినే ఆహారంలో పోషకాలు మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. జంక్ ఫుడ్ మొత్తం బంద్ పెట్టాడు. అయినప్పటికీ అతడు బరువు తగ్గలేదు. దీంతో ఏం చేయాలో అతడికి అంతుపట్టలేదు.. ఈ నేపథ్యంలోనే అందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అతని బరువులు 11 కిలోలు తగ్గేలా చేసింది. దీనికోసం అతడు జిమ్ వెళ్లలేదు. యోగా చేయలేదు. అన్నింటికీ మించి శరీరాన్ని కష్ట పెట్టుకోలేదు.
అమెరికాకు చెందిన కోడి క్రోన్ అనే వ్యక్తికి 56 సంవత్సరాలు వయసు ఉంటుంది. ఇతడు మిస్టర్ రాంగ్లర్ స్టార్ గా అమెరికాలో ఫేమస్.. అయితే ఇతడు విపరీతమైన బరువు ఉండటంతో తీవ్రంగా ఇబ్బంది పడేవాడు. ఇది అతడికి రకరకాల సమస్యలను తెచ్చిపెట్టింది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని భావించిన అతడు అనేక ప్రయత్నాలు చేశాడు. అవి ఏవీ కూడా అతడికి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నీతో అతడు చాట్ జిపిటిని ఆశ్రయించాడు. ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాడు. చాట్ జిపిటి ద్వారా అతడు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాడు. క్రమం తప్పకుండా వాటిని అనుసరించాడు. చక్కరను పూర్తిగా దూరంపెట్టాడు. కంటి నిండా నిద్రపోయాడు. శారీరక శ్రమను చేశాడు. పనికిమాలిన ఆహారాన్ని దూరం పెట్టాడు. ఒకరకంగా తన జీవనశైలని పూర్తిగా మార్చుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండా బరువు తగ్గాడు. కేవలం 46 రోజుల వ్యవధిలోనే 11 కిలోల బరువు తగ్గాడు. ఒకప్పుడు ముందుకు వచ్చిన పొట్ట తో అతడు తీవ్రంగా ఇబ్బంది పడేవాడు. కానీ ఇప్పుడు నాజుకైన శరీరంతో కనిపిస్తున్నాడు. పైగా ఇప్పుడు నడవడం.. పరిగెత్తడం.. కూర్చోవడం అత్యంత సులభంగా మారిపోయాయని అతను చెబుతున్నాడు.
” నాకు ఒకప్పుడు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉండేది. కూల్ డ్రింక్స్ కూడా బాగా తాగేవాడిని. రాత్రిపూట మెలకువతో ఉండే వాడిని. కానీ ఇప్పుడు నాకు అటువంటి అలవాట్లు లేవు. చాట్ జిపిటి నన్ను పూర్తిగా మార్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే నాకు ట్రైనర్ అయిపోయింది. అందువల్ల నేను ఇలా మారిపోయాను. నా శరీరం ముద్దు వచ్చే విధంగా ఉంది. ఇది అద్భుతమైన పరిణామ క్రమం అంటూ” కోడి క్రోన్ వ్యాఖ్యానించాడు.