Rajamouli SSMB29 Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు 12 సినిమాలను చేస్తే ఆ 12 మూవీస్ తో వరుస విజయాలను అందుకున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన సినిమాతో మంత్రముగ్ధుల్ని చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమాని చేస్తున్న ఆయన రెండు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మూడో షెడ్యూల్ కోసమే ఇప్పుడు తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఏ హీరో కోసం చేయనటువంటి గొప్ప త్యాగాన్ని రాజమౌళి మహేష్ బాబు కోసం చేశారనే విషయం ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజమౌళి ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ చేశాడు అంటే అందులో ఒక్క సీను గాని ఒక్క షాట్ గాని మార్చే ప్రసక్తే లేకుండా చూసుకుంటూ ఉంటాడు. కానీ మహేష్ బాబు కోసం ఒక సీను మొత్తాన్ని మార్చేసినట్టుగా తెలుస్తోంది…
Also Read: ఓవర్సీస్ లో మొదలైన ‘కింగ్డమ్’ అడ్వాన్స్ బుకింగ్స్..విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్స్ ఇవే!
మొదట ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేసుకున్న రాజమౌళి దానిని అద్భుతంగా తెరకెక్కించాడు అనుకున్నాడట. కానీ మహేష్ బాబు అందులో కొంతవరకు కొన్ని ఇబ్బందులను తెలియజేయడంతో మహేష్ బాబు కోసం ఆ యాక్షన్ బ్లాక్ మొత్తాన్ని మార్చేసి వేరే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో ఉంటుందా? లేదా అనేది తెలీదు గానీ మొత్తానికైతే రాజమౌళి మొదట అనుకున్నట్టుగా కాకుండా వేరే విధంగా ఆ యాక్షన్ బ్లాక్ ని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన ఎవరి కోసం ఎలాంటి సీన్స్ చేయలేదు.
Also Read: కుబేర’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్..ఈ ప్రాంతాల్లో భారీ నష్టాలు తప్పలేదు!
కానీ మొదటిసారి మహేష్ బాబు కోసం ఆయన ఇలా చేయాల్సి వచ్చింది అంటూ అతని అభిమానులు సైతం కొంత వరకు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు కోసం ఆయన చాలా వరకు కాంప్రమైజ్ అవుతూ వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా వస్తుంది ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…